పెళ్లి పీటలెక్కనున్న సీనియర్ హీరోయిన్ కుమారుడు.. వధువు ఎవరంటే? | Sakshi
Sakshi News home page

ప్రియురాలిని పెళ్లాడనున్న మరో నటుడు..!

Published Fri, Dec 22 2023 4:00 PM

Tanuj Virwani On His Intimate Wedding With Tanya Jacob In Lonavala - Sakshi

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే పలువురు తారలు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా మరో నటుడు పెళ్లికి రెడీ అయిపోయారు.  ప్రముఖ సినీయర్ నటి, హీరోయిన్ రతీ అగ్నిహోత్రి కుమారుడు తనూజ్ విర్వానీ ఓ ఇంటివాడు కానున్నారు. ఈనెల 25న తన ప్రియురాలు తాన్యా జాకబ్‌ను పెళ్లాడనున్నారు. 

వీరి వివాహం ముంబయి-పుణె హైవేలోని లోనావాలాలో జరగనుంది.  ఈ ఏడాది నవంబర్‌లోనే సింగపూర్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్న హీరో తనూజ్ ఓ ఇంటర్వ్యూరు హాజరయ్యారు. తన పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నట్లు వెల్లడించారు.
 
తాన్యతో ప్రేమ గురించి తనూజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనూజ్ మాట్లాడుతూ.. "మేమిద్దరం చాలా కాలంగా తెలుసు.  పదేళ్ల క్రితం తనను ముంబైలో కలిశా. మా కుటుంబాలకు కూడా తాన్య బాగా తెలుసు. తాన్యా సింగపూర్‌కు మారినప్పుడు కూడా మేము క్లోజ్‌గానే ఉన్నామని' తెలిపారు.  పెళ్లి చేసుకోవడానికి ఇదే సరైన సమయమని తనూజ్ వెల్లడించారు. కాగా.. తనూజ్ మదర్ రతి అగ్నిహోత్రి తెలుగు, తమిళంతో పాటు హిందీ, మలయాళం చిత్రాల్లోనూ నటించారు. ఆమె చివరిసారిగా బాలకృష్ణ నటించిన డిక్టేటర్‌ చిత్రంలో కనిపించారు.  

పెళ్లి గురించి తనూజ్ మాట్లాడుతూ.. 'ఆ రోజు కోసం నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నా. నా జీవితంలో సరైన వ్యక్తినే ఎంపిక చేసుకున్నానని నాకు తెలుసు. ప్రస్తుతం నా కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది. మా వివాహా వేడుకకు అందరూ కలిసి రావడం చాలా ఆనందంగా ఉంది. మా పెళ్లిరోజు డిసెంబర్ 25 పవిత్రమైన తేదీలోనే వచ్చింది.  లోనావాలాలోని ఫామ్‌హౌస్ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నా. నా జీవితంలో ఇ ది మధురమైన క్షణం' అంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. తనూజ్ అమెజాన్ వెబ్ సిరీస్ ఇన్‌సైడ్ ఎడ్జ్‌లో వాయు రాఘవన్ పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న పాయిజన్ వెబ్‌ సిరీస్‌లోనూ కీలక పాత్ర పోషించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement