Syed Sohel Ryan Attended Mukku Avinash Wife Baby Shower Function - Sakshi
Sakshi News home page

Syed Sohel Ryan: ముక్కు అవినాశ్‌ భార్యతో పాటు సోహైల్‌కు కూడా సీమంతం వేడుక

Aug 18 2023 2:06 PM | Updated on Aug 18 2023 3:04 PM

Syed Sohel Ryan at Mukku Avinash Wife Baby Shower Function - Sakshi

అవినాశ్‌ భార్య అనూజ సీమంతం వేడుక జరిగిన విషయం తెలిసిందే! ఈ వేడుకకు వెళ్లిన సోహైల్‌ తనకూ సీమంతం చేయాలని పట్టుపట్టాడు. తాను కూడా ప్రెగ్నెంటేనని, తన

బిగ్‌బాస్‌ షోతో బడా క్రేజ్‌ సంపాదించుకున్న నటుడు సయ్యద్‌ సోహైల్‌ రియాన్‌. అప్పటిదాకా చిన్నాచితకా పాత్రలు చేసిన సోహైల్‌ ఈ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో హీరోగా మారాడు. ప్రస్తుతం అతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‍మిస్టర్‌ ప్రెగ్నెంట్‌. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించగా మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాగా పాజిటివ్‌ టాక్‌ అందుకుంటోంది.

ఇకపోతే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోహైల్‌ జబర్దస్త్‌ కమెడియన్‌ ముక్కు అవినాశ్‌ ఇంట జరిగిన ఫంక్షన్‌కు వెళ్లాడు. అవినాశ్‌ భార్య అనూజ సీమంతం వేడుక జరిగిన విషయం తెలిసిందే! ఈ వేడుకకు వెళ్లిన సోహైల్‌ తనకూ సీమంతం చేయాలని పట్టుపట్టాడు. తాను కూడా ప్రెగ్నెంటేనని, తనకెందుకు ఫంక్షన్‌ చేయరని అడిగాడు. మగవాళ్లకు గర్భం రావడం ఏంటి? అని తిడుతూనే అవినాశ్‌ అతడిని కూర్చోబెట్టి పట్టు బట్టలు పెట్టి నెత్తిన అక్షింతలు వేసి ఆశీర్వదించాడు. చివర్లో ఆగస్టు 18 డెలివరీ డేట్‌.. మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ థియేటర్లలో చూడండి అని కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ సినిమా చేశాక సోహైల్‌పై చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే అతడిని ప్రేమించే వారు ఉన్నట్లే, ఇష్టం లేని వారూ ఉంటారని లైట్‌ తీసుకున్నాడు. అంతదాకా ఎందుకు, ఈ సినిమా గురించి అతడి తల్లి కూడా మొదట్లో నెగిటివ్‌గా మాట్లాడింది. కానీ సినిమా చూశాక గర్వంగా ఫీలైంది. కన్నీళ్లు పెట్టుకుంది. ఓ మంచి సినిమా చేశావంటూ సోహైల్‌ను మెచ్చుకుంది.

చదవండి: ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’మూవీ రివ్యూ
జైలర్‌లో డ్యాన్స్‌ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఫేమస్‌ అవ్వడానికి ముందే గదిలో శవమై..

Advertisement
 
Advertisement
Advertisement