సుశాంత్‌ కేసు: కీలక సాక్షుల విచారణ | Sushant Death Case CBI Questioned Key Witnesses | Sakshi
Sakshi News home page

సుశాంత్‌ కేసు: కీలక సాక్షుల విచారణ

Aug 23 2020 3:26 PM | Updated on Aug 23 2020 3:37 PM

Sushant Death Case CBI Questioned Key Witnesses - Sakshi

ముంబై : బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఆదివారం కీలక సాక్షులైన సుశాంత్‌ ఇంటి వంట మనిషి నీరజ్‌, అతడి మిత్రుడు సిద్ధార్థ్‌ పఠానీలను అధికారులు ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం నేర సంఘటనా పునఃసృష్టి కోసం ఇద్దర్నీ సుశాంత్‌ నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ ఫొటో, ఫోరెన్సిక్‌ నిపుణులు ఆధారాలను సేకరించారు. సుశాంత్‌ మృతి చెందిన జూన్‌ 14 నాటి నేర సంఘటనా పునఃసృష్టి వివరాలను నమోదు చేసుకున్నారు. ( ‘ముందురోజు సుశాంత్‌ బెడ్‌రూంలో నలుగురు వ్యక్తులు’)

జూన్ 14కు ముందు జరిగిన విషయాలపై కూడా ఆరా తీశారు. కాగా, గత బుధవారం సుశాంత్‌ కేసును సీబీఐకి అప్పగిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం పది మంది సభ్యుల సీబీఐ బృందం ముంబై చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. 

Advertisement
 
Advertisement
Advertisement