కుశలమా! | Surya Next Movie Kanguva Teaser Released | Sakshi
Sakshi News home page

కుశలమా!

Jul 24 2023 5:47 AM | Updated on Jul 24 2023 5:47 AM

Surya Next Movie Kanguva Teaser Released - Sakshi

సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్‌. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్పై కేఈ జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఆదివారం(జూలై 23) సూర్య పుట్టినరోజు సందర్భంగా ‘కంగువ’ టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. ‘కొండల కోనల్లో కోటి పులులు పట్టినోడు, ముక్కోటి చుక్కలెక్కి దిక్కులñ ల్ల గెలిచినోడు, ఒక్కడే ఒక్క వీరుడురా.. వాడే కంగ’ వంటి డైలాగులు టీజర్‌లో ఉన్నాయి. ‘కుశలమా’ అంటూ సూర్య చెప్పే  డైలాగ్‌తో టీజర్‌ ముగుస్తుంది.

‘‘చారిత్రక నేపథ్యంతో రూపొందుతోన్న చిత్రం ‘కంగువ’. సూర్య కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. త్రీడీలో విజువల్‌ వండర్‌గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు టీమ్‌ శ్రమిస్తోంది. పాన్‌ వరల్డ్‌ మూవీగా పది భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య బర్త్‌ డే సందర్భంగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో టీజర్‌ని రిలీజ్‌ చేశాం.. మరో నాలుగు భాషల్లో త్వరలోనే విడుదల చేస్తాం. వచ్చే ఏడాది వేసవిలో ‘కంగువ’ రిలీజ్‌ కానుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఏజే రాజా, కో ప్రొడ్యూసర్‌: నేహా జ్ఞానవేల్‌ రాజా.

Advertisement
 
Advertisement
Advertisement