ఎలాగా అయిపోయానే... ‘ఓ భామ అయ్యో రామ’ సాంగ్‌ | Suhas Oh Bhama Ayyo Rama Title Song Lyrical Video Released | Sakshi
Sakshi News home page

ఎలాగా అయిపోయానే... ‘ఓ భామ అయ్యో రామ’ సాంగ్‌

Apr 4 2025 3:59 AM | Updated on Apr 4 2025 7:10 AM

Suhas Oh Bhama Ayyo Rama Title Song Lyrical Video Released

సుహాస్, మాళవికా మనోజ్‌ జంటగా నటించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’.  రామ్‌ గోధల దర్శకత్వంలో హరీష్‌ నల్ల నిర్మించారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా ఈ చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేయనుంది. కాగా ‘ఎలాగుండే వాడ్నే... ఎలాగా అయిపోయానే...’ అంటూ సాగే ఈ చిత్రం టైటిల్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను గురువారం విడుదల చేశారు.

 చిత్రసంగీత దర్శకుడు రథన్‌ స్వరాలందించిన ఈ పాటకు శ్రీహర్ష ఈమని సాహిత్యం అందించగా శరత్‌ సంతోష్‌ ఆలపించారు. మొయిన్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు. ‘‘యూత్‌ఫుల్‌గా సాగే ఈ పాటలో హీరో, హీరోయిన్‌ ఎనర్జీ ప్లస్‌ అయ్యే విధంగా ఉంటుంది. ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని హరీష్‌ నల్ల పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలోని ప్రతి పాత్ర బాగుంటుంది’’ అని రామ్‌ గోధల అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement