థియేటర్లలో ఉండగానే ఓటీటీకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Suhas Mandaadi Streaming On This OTT From Today | Sakshi
Sakshi News home page

Mandaadi Movie: ఓటీటీకి వచ్చేసిన రూ.150 కోట్ల మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Oct 8 2026 4:11 PM | Updated on Oct 8 2026 5:02 PM

Suhas Mandaadi Streaming On This OTT From Today

టాలీవుడ్ నటుడు సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మూవీ మండాడి. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీ సూరి, సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీకి వచ్చేసింది.

ముందుగా ప్రకటించినట్లుగానే ఈ రోజు నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఈ సినిమా ఇంకా థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి తీసుకొచ్చారు. అయితే మరోవైపు ఈ మూవీకి వస్తోన్న ఆదరణతో ఈ నెల 9 నుంచే ఐమ్యాక్స్ వర్షన్‌ రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీకి వచ్చిన మరుసటిరోజే మరోసారి థియేటర్లలో మండాడి రిలీజ్ కానుంది.

మండాడి కథేంటంటే..

'మండాడి' విషయానికొస్తే.. సముద్రతీర ప్రాంతమైన కళింగపట్నంలో తరాలుగా పడవ పందేలు జరుగుతుంటాయి. ఆ పోటీల్లో ఎప్పుడూ గెలిచే మండాడి జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఇద్దరు మిత్రులే ముత్తు కాళి (సూరి), సాట్టా పులి (సుహాస్). సముద్రమంతా తెలిసిన ముని (సత్యరాజ్) శిక్షణలో రాటు దేలిన ఆ ఇద్దరూ కాలక్రమంలో బద్ధ శత్రువులవుతారు. పగ, ప్రతీకారాలు వెంటాడుతుండడంతో ముత్తు కాళి ఊరొదిలి హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటూ బతుకుతుంటాడు.

మల్లేశ్ (మిథున్) అనే యువకుడి కారణంగా చోటు చేసుకున్న అనూహ్యమైన పరిణామాలతో కాళి.. మళ్లీ ఊరికి రావాల్సి వస్తుంది. ఇంతకీ మల్లేశ్ అనే యువకుడు ఎవరు? అతనికీ ముత్తుకాళికీ సంబంధం ఏమిటి? ముత్తుకాళి తిరిగి ఊళ్లోకి వచ్చాక ఏం జరిగింది? సాట్టాపులితో వైరం ఎక్కడివరకూ సాగింది?అసలు వాళ్లిద్దరూ శత్రువులుగా మారడం వెనక కారణాలేమిటి? అనేది మిగతా స్టోరీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement