
తెలుగు బిగ్‌బాస్ 7 సీజన్ శుభశ్రీ రాయగురు (Subhashree Rayaguru) త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. మనోభావాలు పాపగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ ప్రియుడు, నటుడు, నిర్మాత అజయ్ మైసూర్‌ను పెళ్లాడబోతుంది. తాజాగా వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫైనల్లీ.. మా ఎంగేజ్‌మెంట్ జరిగిందని క్యాప్షన్ జోడించింది.
ఆన్‌స్క్రీన్ కపుల్.. రియల్ లైఫ్‌లోనూ..
ఈ ఫోటోల్లో శుభశ్రీ లెహంగాలో మరింత అందంగా కనిపించింది. ఇకపోతే శుభశ్రీ ఇటీవలే మేజెస్టీ అనే పాటలో తళుక్కుమని మెరిసింది. ఈ పాటలో ప్రియుడు అజయ్‌తో కలిసి నటించింది. అందులో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు చూపించారు. ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ పెళ్లికి సిద్ధపడటం విశేషం. వీరి నిశ్చితార్థం న్యూస్ తెలిసిన అభిమానులు, బుల్లితెర తారలు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.