స్టార్ హీరో భార్య సూపర్‌ హిట్ చిత్రం.. ఐదేళ్ల తర్వాత వస్తోంది! | Jyothika's Will Be Released In Telugu Very Soon - Sakshi
Sakshi News home page

Jyothika: అలాంటి పాత్రలో అదరగొట్టిన జ్యోతిక.. దాదాపు ఐదేళ్ల తర్వాత !

Feb 5 2024 5:58 PM | Updated on Feb 5 2024 6:13 PM

Star Hero Wife Super Hit Movie Will Be Released In Telugu Very Soon - Sakshi

జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రాక్షసి.  ఎస్ వై గౌతమ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది.  డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్‌ ప్రకాష్, ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. తమిళంలో హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని తాజాగా తెలుగులోనూ తీసుకొస్తున్నారు. అమ్మ ఒడి టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వడ్డి రామానుజం, వల్లెం శేషారెడ్డి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.  

ఈనేపథ్యంలో తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చే టీచర్‌ పాత్రలో జ్యోతిక నటించారు. పాడైపోయిన స్కూళ్లను..  పునరుద్దించాలనుకునే పాత్రలో జ్యోతిక నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే వారికి ఆమె ఒక రాక్షసి అంటూ జ్యోతిక పాత్రను పరిచయం చేయడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. కాగా.. ఈ చిత్రంలో నాగినీడు హరీష్ పేరడీ, పూర్ణిమ భాగ్యరాజ్, సత్యన్ ముఖ్యపాత్రలు పోషించారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement