నేను కూడా డ్యాన్స్ ప్రాక్టీస్‌ చేస్తున్నాను: ఎస్‌.ఎస్‌. తమన్‌ | SS Thaman Explain about OG Tour 2026 | Sakshi
Sakshi News home page

నేను కూడా డ్యాన్స్ ప్రాక్టీస్‌ చేస్తున్నాను: ఎస్‌.ఎస్‌. తమన్‌

Jun 9 2026 12:16 AM | Updated on Jun 9 2026 12:16 AM

SS Thaman Explain about OG Tour 2026

‘‘హైదరాబాద్‌లో ఈ నెల 13న ‘ఓజీ టూర్‌ ఇండియా’ మెగా మ్యూజికల్‌ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నాం. ఈ కాన్సర్ట్‌ పూర్తి మ్యాజికల్‌గా ఉండబోతోంది. మా ప్లే లిస్ట్‌ చూస్తుంటే మాకే ఎనర్జీ వస్తోంది. ఫైర్‌వర్క్స్, ఎల్‌ఈడీ స్క్రీన్స్ , 3డీ ఎఫెక్ట్స్, డ్యాన్స్  పెర్ఫార్మెన్స్ ... అన్నీ అద్భుతంగా ఉంటాయి. గత కొన్ని రోజులుగా నేను కూడా డ్యాన్స్  ప్రాక్టీస్‌ చేస్తున్నాను. ఈ షోలో ఫుల్‌ లెంగ్త్‌ డ్యాన్స్  పెర్ఫార్మెన్స్ లు ఉంటాయి’’ అని సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. తమన్‌ తెలిపారు.

ఏసీటీసీ, ఎస్‌.ఎస్‌.తమన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఓజీ టూర్‌ ఇండియా’ మెగా మ్యూజికల్‌ ఈవెంట్‌ ఈ నెల 13న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను తెలిపేందుకు హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎస్‌.ఎస్‌. తమన్‌ మాట్లాడుతూ–‘‘ఓజీ’ సినిమా అప్రిషియేషన్‌ సెలబ్రేషన్ ను కొనసాగిస్తూ ‘ఓజీ టూర్‌ ఇండియా’ను నిర్వహిస్తున్నాం.

జూన్‌ 13న హైదరాబాద్‌లో, జూలై 11న బెంగళూరులో, ఆగస్టు 15న చెన్నైలో, సెప్టెంబర్‌ 25న వైజాగ్‌లో ఈవెంట్లు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం నేను ‘మెగా 158, ఎన్‌బీకే 111, ఆదర్శ కుటుంబం, లెనిన్, ఇట్లు అర్జున’ వంటి చిత్రాలకు సంగీతం అందిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘తమన్‌గారితో కలిసి ఈ టూర్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు ఏసీటీసీ నిర్వాహకుడు శరవణన్‌ వాసు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement