తక్కువ సమయంలోనే ఎక్కువ చిత్రాలు చేసి పాన్ ఇండియా కథానాయకగా పేరు తెచ్చుకున్న నటి శ్రీలీల. ముందు డాక్టర్ అయి ఆ తర్వాత యాక్టర్ అయినా ఈ బ్యూటీ అమెరికా , మెక్సికో జిల్లాలో పుట్టి బెంగళూరులో పెరిగారన్నది తెలిసిందే. కిస్ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకగా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత పెళ్లి సందడితో తెలుగులో సందడి చేశారు. ఆ తర్వాత నటించిన ధమాకా చిత్రం మంచి విజయాన్ని అందించింది అంతే ఆపై వరుసగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటూ క్రేజీ హీరోయిన్గా రాణిస్తున్నారు.
దీంతో ఓపక్క చిత్రాలు నటిస్తూనే మరోపక్క వాణిజ్య ప్రకటనలో నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు. అంతేకాకుండా షాపుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులకు మరింత దగ్గర అవుతున్నారు. పుష్ప 2 చిత్రంలో కిసక్కు అనే ఐటెం సాంగ్లో నటించి కురక్రారును కిర్రెరక్కించారు.
ఆ తర్వాత పరాశక్తి చిత్తంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఒక హిందీ చిత్రంలో నటిస్తూ పాన్ ఇండియా కథానాయకగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఎక్కువగా షాపుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు పాల్గొనడం గురించి ఆమె పేర్కొంటూ..‘ నాకు తరచూ అభిమానులను కలుసుకోవడం ఎంతో ఇష్టం. అభిమానులను ప్రత్యక్షంగా కలుసుకున్నప్పుడు వారు చూపే ప్రేమాభిమానాలు నాకు నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అలాంటి అభిమానుల కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం. అభిమానుల అంచనాలను పూర్తి చేయడానికి మంచి మంచి కథా చిత్రాల్లో నటించడానికి ప్రయత్నిస్తున్నాను’ అని నటి శ్రీలీల పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో నటుడు ధనుష్‌కు జంటగా ఓం చిత్రంతో పాటు ఒక హిందీ చిత్రంలోనూ నటిస్తున్నారు.


