మరదలు చేయాల్సిన సినిమా.. ధనుష్‌ చేస్తున్నాడు! | Sakshi
Sakshi News home page

Soundarya Rajinikanth: ధనుష్‌ మూడో సినిమా! సౌందర్య రజనీకాంత్‌ కామెంట్స్‌ వైరల్‌..

Published Mon, Dec 25 2023 1:58 PM

Soundarya Rajinikanth was supposed to Direct Nilavukku En Mel Ennadi Kobam - Sakshi

నటుడిగా ఈ మధ్యే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు ధనుష్‌. అయితే ధనుష్‌ కేవలం నటుడు మాత్రమే కాదు.. గేయ రచయిత, సింగర్‌, నిర్మాత, దర్శకుడు కూడా! 2017లో వచ్చిన పా పండి చిత్రంతో దర్శకుడిగా మారాడు ధనుష్‌. దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్‌ పట్టాడు. తన 50వ సినిమాకు తనే దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే నిలవుక్కు ఎన్మెల్‌ ఎన్నడి కోబం సినిమాకు సైతం దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. క్రిస్‌మస్‌ సందర్భంగా నిలవుక్కు ఎన్మెల్‌ ఎన్నడి కోబం సినిమా మోషన్‌ పోస్టర్‌ను ధనుష్‌ రిలీజ్‌ చేశాడు ధనుష్‌.

ధనుష్‌ మూడో సినిమా!
ఇందులో సినిమాలో నటించే తారాగణాన్ని పరిచయం చేశాడు. మాథ్యూ థామస్‌, పవిశ్‌, అనిఖా సురేంద్రన్‌, ప్రియ ప్రకాశ్‌ వారియర్‌, రమ్య రంగనాథన్‌, వెంకటేశ్‌ మీనన్‌, రబియా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు వీడియో ద్వారా స్పష్టం చేశారు. అయితే ఈ సినిమా ఇప్పటికిప్పుడు అనుకుని చేసింది కాదు! చాలా ఏళ్ల క్రితమే ఈ సినిమా కథ రాసుకున్నాడు ధనుష్‌. అంతేకాదు, ఈ చిత్రాన్ని తెరకెక్కించాల్సిన బాధ్యత నీదేనంటూ తన మరదలు సౌందర్య రజనీకాంత్‌(ధనుష్‌ భార్య ఐశ్వర్య సోదరి)కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు. 

వీఐపీ 2 వల్ల సైడ్‌ అయిపోయిన ప్రాజెక్ట్‌
ఈ విషయాన్ని సౌందర్య గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది. 'నిలవుక్కు ఎన్మెల్‌ ఎన్నడి కోబం సినిమా కోసం ఎంతో కసరత్తులు చేశాను. ఈ సినిమాకు నటీనటులు కావలెనంటూ సోషల్‌ మీడియాలోనూ ప్రకటించాం. ధనుష్‌ ఈ స్క్రిప్ట్‌ చాలా బాగా రాశాడు. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమాకు సరైనవాళ్లను ఎంచుకోలేకపోయాం. పైగా అదే సమయంలో వీఐపీ 2(రఘువరన్‌ బీటెక్‌ సీక్వెల్‌) గురించి చర్చలు జరగడంతో ఇది సైడ్‌ అయిపోయింది' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె చెప్పినట్లుగానే ధనుష్‌ 'వీఐపీ 2' సినిమాకు దర్శకురాలిగా వ్యవహరించింది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇకపోతే ధనుష్‌- ఐశ్వర్య రజనీకాంత్‌ గతేడాది విడిపోయిన సంగతి తెలిసిందే!

చదవండి: ఆర్థిక కష్టాల్లో కమెడియన్‌ కుటుంబం.. సాయం చేసిన విజయకాంత్‌!

Advertisement
Advertisement