సోనూ సూద్ భార్యకు ప్రమాదం.. అభిమానులకు హీరో సందేశం | Sonu Sood video message for all Fans after wife Sonali road accident | Sakshi
Sakshi News home page

Sonu Sood: 'అది పెట్టుకోకపోతే.. మీ కుటుంబం లేనట్లే'.. సోనూ సూద్ వీడియో సందేశం

Apr 7 2025 5:12 PM | Updated on Apr 7 2025 6:39 PM

Sonu Sood video message for all Fans after wife Sonali road accident

బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తెలుగువారికి సుపరిచితమైన పేరు. అరుంధతి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు.  పలు సినిమాల్లో సహాయ నటుడు, విలన్ పాత్రలతో మెప్పించారు.  సోనూసూద్ ప్రస్తుతం హిందీలో మాత్రమే మూవీస్ చేస్తున్నాడు. తన ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేదలకు అండగా నిలుస్తున్నారు.

అయితే ఇటీవల సోనూ సూద్ భార్య సోనాలి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో  సోనాలితో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. అయితే ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ నేపథ్యంలో అభిమానుల కోసం సోనూ సూద్ ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. ఇటీవల నా భార్యకు యాక్సిడెంట్‌ జరిగిన విషయం మీకు కూడా తెలుసని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ కారులో వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. సీట్ బెల్ట్ లేకపోతే.. మీరు మీ కుటుంబాన్ని కోల్పోయినట్లే అని సోనూ సూద్ తెలిపారు. మీరు వెనుక సీటులో కూర్చున్నప్పటికీ కూడా సీట్ బెల్ట్ ధరించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement