నేను రక్షకుడిని కాదు!

లాక్‌డౌన్ సమయంలో ఎంతోమంది తమ ప్రాంతాలు చేరుకునేందుకు సహాయపడ్డారు నటుడు సోనూ సూద్. ‘మా పాలిట రక్షకుడిలా వచ్చావు’ అని దీవెనలందించారు వలస కార్మికులు. సూపర్ హీరో అని సోషల్ మీడియాలో ఒకటే పొగడ్తల వర్షం. అయితే ఇప్పుడు సోనూ సూద్ మాత్రం ‘నేను రక్షకుడిని కాను’ అంటున్నారు. ‘ఐయామ్ నో మెసయ్యా’ (నేను రక్షకుడిని/కాపాడేవాడిని కాదు అని అర్థం) అనే టైటిల్‌తో తన ఆత్మకథను రాసుకున్నారు. ఈ పుస్తకం డిసెంబర్‌లో విడుదల కానుంది. ‘ఇది నా జీవిత కథ. కేవలం నాది మాత్రమే కాదు. ఎన్నో వేలమంది వలస కార్మికుల కథ’ అన్నారు సోనూ సూద్.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి