ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్‌.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్ | Sonakshi Sinha Shares Her FIRST Wedding Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Sonakshi Sinha: ఏడేళ్ల ప్రేమ.. పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన హీరామండి నటి!

Jun 23 2024 8:26 PM | Updated on Jun 23 2024 8:26 PM

Sonakshi Sinha Shares Her FIRST Wedding Photos Goes Viral

బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు జహీర్‌ ఇక్బాల్‌ను పెళ్లాడింది. ఏడేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట ముంబయిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని సోనాక్షి తన అభిమానులతో పంచుకున్నారు. తన జీవితంలో ఇది ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోతుందని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా సోనాక్షిని చేతిని ఇక్బాల్ ముద్దాడుతున్న ఫోటోను పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు, సినీతారలు సోనాక్షికి అభినందనలు చెబుతున్నారు.

సోనాక్షి తన ఇన్‌స్టాలో రాస్తూ.. " సరిగ్గా ఏడేళ్ల క్రితం (23.06.2017) ఇదే రోజున మేము ప్రేమలో పడ్డాం. ఈ రోజు ఆ ప్రేమ అన్ని సవాళ్లను దాటి విజయం సాధించాం. ఇది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఈ క్షణం. మా ఇద్దరి కుటుంబాలు, దేవుళ్ల ఆశీర్వాదంతో మేము ఇప్పుడు భార్యాభర్తలం అయ్యాం. ఇక్కడ నుంచి ఎప్పటికీ ఒకరికొకరు ప్రేమతో పాటు అన్ని విషయాలు కలిసికట్టుగా ఉంటాం.' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. వీరిద్దరు 2022లో విడుదలైన డబుల్ ఎక్స్‌ఎల్‌ చిత్రంలో నటించారు. సోనాక్షి ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన హీరామండి వెబ్ సిరీస్‌లో మెప్పించింది. 

Advertisement
 
Advertisement
Advertisement