ఇటీవలే ప్రియుడితో పెళ్లి.. ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై సోనాక్షి ఏమందంటే? | Sonakshi Sinha Reacts To Pregnancy Rumours with Jaheer Iqbal | Sakshi
Sakshi News home page

Sonakshi Sinha: 'ఆస్పత్రికి వెళ్తే చాలు'.. ప్రెగ్నెన్సీపై సోనాక్షి రియాక్షన్‌!

Jul 5 2024 7:25 PM | Updated on Jul 5 2024 8:52 PM

Sonakshi Sinha Reacts To Pregnancy Rumours with Jaheer Iqbal

ఇటీవల హీరామండి వెబ్‌ సిరీస్‌తో మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్‌ ఓటీటీలో దూసుకెళ్తోంది. ఇందులో మనీషా కొయిరాలా, ఆదితి రావు హైదరీతో పాటు ఆరుగురు హీరోయిన్లు నటించారు. ప్రస్తుతం సోనాక్షి కాకుడ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్ కూడా నటించారు. ఈ చిత్రం జూలై 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌కు రానుంది.

ఇదిలా ఉండగా.. గతనెల 23న సోనాక్షి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన వీరి పెళ్లికి సినీతారలు, సన్నిహితులు కూడా హాజరయ్యారు. ఇటీవల ఈ జంట హనీమూన్‌ కూడా వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

తాజాగా తన  రాబోయే మూవీ కుకుడ ప్రమోషన్లలో సోనాక్షి పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటరాక్షన్‌లో జహీర్ ఇక్బాల్‌తో పెళ్లి తర్వాత ఆమె జీవితం గురించి ప్రశ్నించారు. నా లైఫ్ పెళ్లికి ముందు సంతోషంగానే ఉందని తెలిపారు. పెళ్లి తర్వాత మరింత ఆనందంగా ఉన్నానని సోనాక్షి వెల్లడించారు.

గతంలో మీరిద్దరు కలిసి ఓ ఆస్పత్రికి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఆ సమయంలో మీరు గర్భంతో ఉన్నారని ఊహనాగాలొచ్చాయి కదా? దీనిపై మీరేమంటారు? అంటూ సోనాక్షిని ప్రశ్నించారు. దీనిపై మాట్లాడుతూ..' ఇప్పుడు మేము ఆస్పత్రి వెళ్లలేము.. ఎందుకంటే మీరు వెంటనే గర్భవతి అని డిసైడ్‌ చేసేస్తారు' అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement