నేరుగా ఓటీటీకి హారర్‌ కామెడీ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Sonakshi Sinha Latest Movie Kakuda Directly Releasing In This OTT, Check Release Date And Streaming Platform | Sakshi
Sakshi News home page

Kakuda Movie OTT Release: హీరామండి నటి హారర్ కామెడీ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Jun 25 2024 6:22 PM | Updated on Jun 25 2024 6:35 PM

Sonakshi Sinha Latest Movie Directly Released On This Ott

ఇటీవల కాలంలో హారర్‌, కామెడీ చిత్రాలకు ఎక్కువ ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా ఓటీటీల్లో ఇలాంటి కంటెంట్‌కు మంచి డిమాండ్ ఉంది. తాజాగా అలాంటి చిత్రం ద్వారా అలరించేందుకు వస్తోంది బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా. కకుడా అనే మూవీతో అభిమానులను పలకరించునుంది. ఈ చిత్రంలో రితేష్‌ దేశ్‌ముఖ్, సాక్విబ్‌ సలీమ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హారర్‌ కామెడీ కథాంశంతో మరాఠీ దర్శకుడు ఆదిత్య సర్పోట్‌దర్‌ ఈ సినిమాను తెరకెక్కించారు.

అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్‌ చేయనున్నారు మేకర్స్. ఈ విషయాన్ని వెల్లడిస్తూ స్పెషల్ పోస్టర్‌ విడుదల చేశారు. జూలై 12వ తేదీ నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. తాజా పోస్టర్ చూస్తే దెయ్యం ప్రధాన అంశంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

కాగా.. ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్‌తో అభిమానులను ‍అలరించింది సోనాక్షి. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన వీరి వివాహానికి బాలీవుడ్ తారలు, సన్నిహితులు కూడా హాజరయ్యారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement