4000 కోట్ల సినిమా.. చూడకుండానే ట్రోల్స్‌ చేయడం సరికాదు: యశ్‌ | Yash Spoke About Ramayana Movie Trolling | Sakshi
Sakshi News home page

Ramayana Movie: ‘రామాయణ’పై ట్రోలింగ్‌.. స్పందించిన యశ్‌

Oct 16 2026 12:51 PM | Updated on Oct 16 2026 12:56 PM

Yash Spoke About Ramayana Movie Trolling

రామాయణం ఆధారంగా నితీష్‌ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ సినిమా ‘రామాయణ’. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్‌ నటించారు. ‘రామాయణ పార్ట్‌ 1’ని ఈ నవంబరు 5న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇప్పటికీ విడుదలైన రెండు ట్రైలర్లు ఆకట్టుకున్నాయి.

సినిమాపై నిర్మాణాత్మక విమర్శలు ఉండవచ్చు
అయితే ఈ సినిమాపై సోషల్‌ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌కు యశ్‌ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన.. సుమారు 4000 కోట్లతో తెరకెక్కుతున్న ఈ గొప్ప ప్రాజెక్టుకు అందరి మద్దతు అవసరమని తెలిపారు. అంతేకాని సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ చేయడం సరికాదన్నారు.

‘సినిమాపై నిర్మాణాత్మక విమర్శలు ఉండవచ్చు. అసలు మూవీని చూడకుండానే ముందుగానే దాన్ని తప్పుబట్టడం సరికాదు. భారతీయ సినిమాను అందరూ ఆదరించాలి’ అని యాశ్‌ అన్నారు. దీంతో పాటు ఆయన గత చిత్రం టాక్సిక్‌ గురించి ప్రస్తావిస్తూ.. అన్ని అడ్డంకులను ఎదుర్కొని ప్రేక్షకులు ఆ సినిమాను ఎన్నోసార్లు చూసి, భారీ కలెక్షన్లు వచ్చేందుకు సహకరించారని గుర్తుచేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.

(ఇదీ చదవండి: తొలి రోజే కలెక్షన్ల సునామీ.. జైలర్ 2కు ఎన్ని కోట్లంటే?)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement