‘ఎస్‌ఎక్స్‌డబ్ల్యు’ లో ‘మంకీ మేన్‌’.. తెలుగు అమ్మాయిపై ప్రశంసలు | Sobhita Dhulipala Interesting Comments About Working On Hollywood Movie Monkey Man, Deets Inside - Sakshi
Sakshi News home page

Monkey Man Movie: హాలీవుడ్‌ సినిమాలో తెలుగు అమ్మాయి... ‘ఎస్‌ఎక్స్‌డబ్ల్యు’ లోప్రీమియర్‌ షో

Mar 19 2024 1:55 PM | Updated on Mar 19 2024 3:04 PM

Sobhita Dhulipala Talk About Hollywood Movie Monkey Man - Sakshi

పట్టుమని పదే సినిమాల్లో నటించిన ఒక ఆర్టిస్ట్‌కి హాలీవుడ్‌ చాన్స్‌ వస్తే... పట్టరానంత ఆనందం కలుగుతుంది. హాలీవుడ్‌ చిత్రం ‘మంకీ మేన్‌’కి అవకాశం వచ్చినప్పుడు తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళకు  అలాంటి ఆనందమే దక్కింది. పైగా ఈ చిత్రానికి ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’ ఫేమ్‌ నటుడు దేవ్‌ పటేల్‌ డైరెక్టర్‌ కావడం, హనుమంతుని పురాణం స్ఫూర్తిగా రూపొందడంతో మంచి అవకాశంగా భావిస్తున్నారు శోభిత. ఇటీవల  యూఎస్‌లోని ఆస్టిన్‌లో జరిగే ప్రతిష్టాత్మక ‘ఎస్‌ఎక్స్‌డబ్ల్యు’ (సౌత్‌ బై సౌత్‌వెస్ట్‌)లో ఈ చిత్రం ప్రదర్శితమైంది.

ఈ ప్రీమియర్‌కి హాజరైన శోభితా ధూళిపాళ మాట్లాడుతూ – ‘‘ఈ వరల్డ్‌ ప్రీమియర్‌లో మా సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు అరుపులు, చప్పట్లతో నినాదాలు చేశారు. స్టాండింగ్‌ ఒవేషన్‌తోనూ ప్రశంసించారు. దేవ్‌ పటేల్‌కి డైరెక్టర్‌గా ఇది ఫస్ట్‌ మూవీ. హాలీవుడ్‌లో నాకు ఇది ఫస్ట్‌ మూవీ. ఈ చిత్రంలో నాది పెద్ద భాగం కానప్పటికీ, వేరే భాషలో నటించడం, అది కూడా దేవ్‌ పటేల్‌ విజన్‌లో నేను భాగం కావడం చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు. ఇక పలువురు హాలీవుడ్‌ తారలతో పాటు విపిన్‌ శర్మ, అశ్వినీ కల్సేఖర్, మకరంద్‌ దేశ్‌పాండే వంటి భారతీయ తారలు నటించిన ‘మంకీ మేన్‌’ ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement