ఓటీటీలో 'స్కంద' స్ట్రీమింగ్‌ | Skanda Movie Streaming Started In This OTT, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Skanda Movie In OTT: ఓటీటీలో 'స్కంద' స్ట్రీమింగ్‌.. ఎప్పుడు,ఎక్కడ..?

Oct 24 2023 7:10 AM | Updated on Oct 24 2023 9:58 AM

 Skanda Movie Streaming In Hotstar - Sakshi

బోయపాటి శ్రీను- రామ్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం స్కంద.   ఇందులో శ్రీలీల కథానాయికగా నటించింది.  గత నెల 28న  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది.  ప్రస్తుతం ఓటీటీలో సందడి చేయడానికి ఈ మాస్‌ సినిమా సిద్దమైంది. సినిమా విషయంలో మిశ్రమ స్పందన వచ్చినా బోయపాటి మార్క్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి.

సుమారు రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన స్కంద అక్టోబరు 27వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘స్కంద’ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలని మొదట స్కందతో ఒప్పందం కుదిరిందట. అయితే ఇప్పుడు ముందుగానే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు సమాచారం.

 స్కంద సినిమాకు థమన్‌ స్వరాలు సమకూర్చారు. బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై శ్రీనివాస్‌ చిట్టూరి, పవన్‌ కుమార్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక స్కంద తర్వాత రామ్ పోతినేని- పూరి కాంబినేషన్‌లో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement