దుస్తులు విప్పమన్న జనసేన నేత.. మండిపడ్డ చిన్మయి | Singer Chinmayi Fires On JanaSena party Vulgar Comments On Women | Sakshi
Sakshi News home page

దుస్తులు విప్పమన్న జనసేన నేత.. మండిపడ్డ చిన్మయి

Jan 17 2026 11:30 AM | Updated on Jan 17 2026 11:56 AM

Singer Chinmayi Fires On JanaSena party Vulgar Comments On Women

సింగర్చిన్మయి సోషల్మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికి తెలిసిందే. మహిళలపై జరిగే దాడులు, అవమానాలపై స్పందిస్తుంటారు. సోషల్మీడియాలో తనను తీవ్రంగా ట్రోల్చేసినా సరే.. తనకు తప్పుగా అనిపించిన అంశాలపై నిర్భయంగా మట్లాడుతుంటారు. తాజాగా ఆమె తన ట్విటర్లో షేర్చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్అవుతుంది. మహిళలపై జనసేన నేత అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

దుస్తులు విప్పమన్న జనసేన నేత..
పవిత్రమైన సంక్రాంతి పండుగ వేళ కోనసీమ సంస్కృతిని మంటగలిపేలా రాజోలు నియోజకవర్గంలో యథేచ్చగా రికార్డింగ్డ్యాన్స్లు నిర్వహించారు. అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీ నేతలే వీటిని ప్రోత్సహించడం గమనార్హం. రాజోలు జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ ముఖ్య అనుచరుడు ఒకరు మలికిపురం మండలం గోగన్నమట్టం గ్రామంలో రికార్డింగ్డ్యాన్స్నిర్వహించాడు. వేదికపై కూర్చొని ఉన్న రికార్డింగ్ డాన్సర్లతో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించాడు. దుస్తులు విప్పేసి డ్యాన్స్చేయాలంటూ డ్యాన్సర్లకు కండీషన్పెట్టాడు. వీడియో నెట్టింట వైరల్అయింది. సదరు జనసేన నేతపై నెటిజన్లు మండిపడుతున్నారు.

 అశ్లీల గందరగోళమే..
వీడియోని సింగర్చిన్మయి తన ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాలో షేర్చేస్తూ.. ‘ప్రేక్షకులు చీరింగ్ చేస్తుండగానే స్టేజ్‌పై ఉన్న అమ్మాయిలను ఇలా అవమానిస్తారని ఊహించలేదు. వ్యక్తి అమ్మాయిల దుస్తులను విప్పమంటున్నాడు. అది విని అక్కడున్నవారంతా చప్పట్లు కొడుతున్నారు. ఇది బయటకు రావడం మంచిదా కాదా కూడా అర్థం కావడం లేదు. ఇక్కడ కనిపిస్తున్న భాష, ప్రవర్తన అత్యంత నీచమైనవి. ఇది పూర్తిగా అశ్లీల గందరగోళమేఅని రాసుకొచ్చారు. చిన్మయి ట్వీట్పై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతుంది. పలువురు నెటిజన్లు ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ పోస్టులు పెడితే..మరికొంతమంది ఆమెను విమర్శిస్తూ.. కామెంట్చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement