మొన్నే తూచ్‌ అన్నాడు.. ఇప్పుడేమో బాబుతో దర్శనం! | Sidhu Moosewala Father Balkaur Singh Welcomes Newborn Son, Shares Photo | Sakshi
Sakshi News home page

దిగ్గజ ర్యాపర్‌ మళ్లీ పుట్టాడు.. 58 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

Mar 17 2024 10:27 AM | Updated on Mar 17 2024 10:51 AM

Sidhu Moosewala Father Balkaur Singh Welcomes Newborn Son, Shares Photo - Sakshi

కట్‌ చేస్తే సిద్దూ మూసేవాలా పేరెంట్స్‌ మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఓ బాబుకు జన్మనిచ్చారు. బల్కౌర్‌ సింగ్‌ ఓ బాబును ఎత్తుకుని ఉన్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌

పంజాబ్‌ ర్యాపర్‌, దివంగత సింగర్‌ సిద్దు మూసేవాలా మరణం ఇప్పుడు గుర్తు చేసుకున్నా మనసు చివుక్కుమంటుంది. దేశవ్యాప్తంగా పేరు మోసిన ఈ సింగర్‌ను 2022లో దారుణంగా హత్య చేశారు. ఒక్కగానొక్క కొడుకు ఇక లేడన్న నిజాన్ని సిద్దూ పేరెంట్స్‌ జీర్ణించుకోలేకపోయారు. లెజెండ్స్‌కు చావు ఉండదని నమ్మారు. తన కొడుకును మళ్లీ చూసుకోవాలని మురిసిపోయారు. ఈ క్రమంలో 58 ఏళ్ల వయసులో సిద్దు తల్లి చరణ్‌ సింగ్‌ ఐవీఎఫ్‌ ద్వారా తల్లి కాబోతోందని వార్తలు వెలువడ్డాయి. దీనిపై సిద్దు తండ్రి బల్కౌర్‌ సింగ్‌ స్పందిస్తూ అదంతా ఏమీ లేదని, ఏ రూమర్స్‌నూ పట్టించుకోవద్దని చెప్పాడు.

బాబుకు జన్మనిచ్చిన ర్యాపర్‌ తల్లి
కట్‌ చేస్తే సిద్దూ మూసేవాలా పేరెంట్స్‌ మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఓ బాబుకు జన్మనిచ్చారు. బల్కౌర్‌ సింగ్‌ ఓ బాబును ఎత్తుకుని ఉన్న ఫోటోను ఆదివారం (మార్చి 17న) సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. 'శుభ్‌దీప్‌ (సిద్దు మూసేవాలా అసలు పేరు)ను ప్రేమించిన లక్షలాది మంది ఆశీర్వాదాలతో అతడికి ఓ తమ్ముడు పుట్టాడు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఙతలు తెలియజేస్తున్నాను' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. సిద్దు మూసేవాలా మళ్లీ పుట్టాడు అని కామెంట్లు చేస్తున్నారు.

పుస్తకం..
ఇకపోతే సిద్దూ జీవిత కథ ఆధారంగా ‘హూ కిల్డ్‌ మూసేవాలా? ది స్పైరలింగ్‌ స్టోరీ ఆఫ్‌ వాయలెన్స్‌ ఇన్‌ పంజాబ్‌' అనే పుస్తకం కూడా వచ్చింది. జుపిందర్‌ జీత్‌ సింగ్‌ ఈ పుస్తకాన్ని రచ్చించారు. పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్ల ఆధిపత్యం, మాదకద్రవ్యాల వినియోగం, ఆ రాష్ట్రంలో సంగీత ప్రపంచం వెనుక దాగి ఉన్న చీకటి కోణాలను ఈ పుస్తకం చూపించింది.

చదవండి: ఒక్క సీన్‌ కోసం రూ. 5 కోట్లు అందుకున్న నయనతార

Advertisement
 
Advertisement
Advertisement