సోషల్‌ మీడియాలో రిక్వెస్ట్‌లు వచ్చేవి  | Siddhu Jonnalagadda Its Complicated Release date fix | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో రిక్వెస్ట్‌లు వచ్చేవి 

Feb 13 2025 12:25 AM | Updated on Feb 13 2025 12:27 AM

Siddhu Jonnalagadda Its Complicated Release date fix

– నటుడు–నిర్మాత రానా

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా శ్రద్ధా శ్రీనాథ్, సీరత్‌ కపూర్, షాలినీ వడ్నికట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’. రవికాంత్‌ పేరేపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి,  సంజయ్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం 2020లో డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజైంది. కాగా ఈ సినిమాను ‘ఇట్స్‌ కాంప్లికేటెడ్‌’ టైటిల్‌తో ఈ 14న థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో రానా మాట్లాడుతూ– ‘‘సోషల్‌ మీడియాలో ఈ సినిమా గురించి ఎప్పుడూ రిక్వెస్ట్‌లు వచ్చేవి. ఒక రోజు సిద్ధు ఈ సినిమా గురించి చెప్పారు. ఈ సినిమా రిలీజ్‌కి వేలంటైన్స్‌ డే పర్ఫెక్ట్‌ టైమ్‌. నేను ఆడియన్స్‌కు డిఫరెంట్‌ కథలు చూపించేందుకు ఇష్టపడతాను. 

కథ ఎంత కొత్తగా ఉంది? ఆడియన్స్‌కు మనం ఏం చెబుతున్నాం? అనేది కూడా చూస్తాను’’ అని తెలిపారు. ‘‘థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిన మూవీ ఇది. ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్‌ చేసి ఉంటే సిక్స్‌ టైమ్స్‌ ఎక్కువ వచ్చేది’’ అన్నారు సిద్ధు జొన్నలగడ్డ. ‘‘లాక్‌డౌన్‌ సమయంలో ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్‌ చేయడం కుదర్లేదు. ఈ సినిమాతో అందరూ రిలేట్‌ అవుతారు’’ అని పేర్కొన్నారు రవికాంత్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement