టీనేజ్‌లో చేసిన పనికి నాన్న కోప్పడ్డారు: శృతిహాసన్ | Shruti Haasan on her teenage act that angered Kamal Haasan | Sakshi
Sakshi News home page

Shruti Haasan: టీనేజ్‌లో నాన్నకు కోపం తెప్పించా: శృతిహాసన్

Jun 23 2026 7:45 PM | Updated on Jun 23 2026 7:50 PM

Shruti Haasan on her teenage act that angered Kamal Haasan

కోలీవుడ్ భామ శృతిహాసన్ ఇటీవలే రామ్ చరణ్ పెద్ది మూవీలో కనిపించింది. ఈ చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది ముద్దుగుమ్మ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తోన్న శృతిహాసన్.. తాజాగా అభిమానులతో ఆస్క్ మీ ఎనిథింగ్ అంటూ సోషల్ మీడియాలో ఓ సెషన్ నిర్వహించింది. ఈ సెషన్‌లో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

ఈ సెషన్‌లో పాల్గొన్న నెటిజన్స్ శృతికి కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటిలో ఓ ఆసక్తికర ప్రశ్న కూడా ఎదురైంది. మీరు బొడ్డుకు పియర్సింగ్ ఉందా?.. ఎప్పుడు చేయించుకున్నారు అని అడిగింది ఓ నెటిజన్. దీనికి శృతిహాసన్ కూడా బదులిచ్చింది. అవును, ఉంది. నాకు 19 ఏళ్ల వయసులో చేయించుకున్నానని తెలిపింది. ఆ తర్వాత ఈ విషయం తెలిసి నాన్న నాపై చాలా కోపంగా ఉన్నారని వెల్లడించింది.

అంతేకాకుడా తన జుట్టు సంరక్షణ గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకుంది. జుట్టు సంరక్షణ, స్టైలింగ్ కోసం తరచుగా సెలూన్‌లకు వెళ్తారని అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చింది. తాను ఐదేళ్లుగా హెయిర్ సెలూన్‌కు వెళ్లలేదని శృతి వెల్లడించారు. చివరిసారిగా నా జుట్టుకు 2017లో రంగు వేసుకున్నానని తెలిపింది. నా జుట్టును నేనే కత్తిరించుకుంటా..నేనే ట్రీట్మెంట్ చేసుకుంటానని సమాధానమిచ్చింది. తరచుగా సెలూన్‌లకు వెళ్లడంపై ఆధారపడటం కంటే తన జుట్టు సంరక్షణను తానే చూసుకోవడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చింది.

ఇక శృతి సినిమాల విషయానికొస్తే ఆమె ఇటీవలే 'పెద్ది' చిత్రంలోని ఐటమ్‌ సాంగ్‌లో కనిపించింది. ప్రస్తుతం మైస్కిన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్నారు. అంతేకాకుండా తెలుగులో పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆకాశంలో ఒక తార' చిత్రంలో దుల్కర్ సల్మాన్‌ సరసన కనిపించనున్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement