Shruthi Haasan Interesting Comments About Her Lover Shantanu - Sakshi
Sakshi News home page

shruthi Haasan: అతనిలో నాకు నచ్చింది అదే.. లవర్‌పై శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్!

Aug 8 2023 4:44 PM | Updated on Aug 8 2023 5:23 PM

shruthi Haasan Interesting Comments About Her Lover Shantanu - Sakshi

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న భామ శృతిహాసన్.  బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన భామ పలు చిత్రాల్లో నటించారు. అయితే ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలోనే టచ్‌లో ఉంటోంది కోలీవుడ్ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటోంది. తన ప్రియుడు శాంతను హజారికాతో కలిసి రొమాంటిక్ వీడియోస్ సైతం అభిమానులతో పంచుకుంటోంది. 

(ఇది చదవండి: సురేఖవాణి కూతురు బర్త్‌డే.. పబ్‌లో డ్యాన్స్ చేస్తూ! )

అయితే తాజాగా శ్రుతి హాసన్ తన ప్రియుడి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.  ప్రస్తుతం ప్రియుడితో కలిసి ముంబైలో ఉంటున్న ముద్దుగుమ్మ.. షూటింగ్‌లు లేకపోతే వెంటనే ఫ్లాట్‌కు వెళ్లి శంతనుతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ జంట నెట్టింట్లో చేసే హంగామా అంతా ఇంతా కాదు.  చాలా గ్యాప్ తరువాత యాక్షన్ సీక్వెన్స్, బాక్సింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటోంది శృతి. 

తాజాగా శంతనుతో కలిసి ఫన్నీ క్విజ్‌ను నిర్వహించగా.. వీరికి ఫ్యాన్స్ రకరకాల ప్రశ్నలు సంధించారు. ఎవరు బాగా వండుతారు? అనే ప్రశ్నకు నేనే బాగా వండుతా ఉంటూ ఆన్సరిచ్చింది.  ఆ తర్వాత ఎవరు బాగా తింటారు? అనే దానికి శంతను అంటూ చెప్పుకొచ్చింది. మీ లవర్‌లో నచ్చే లక్షణాలు ఏంటి? అనే ప్రశ్నకు శృతి హాసన్ ఆసక్తికర  సమాధానం చెప్పింది. అదేంటో తెలుసుకుందాం. 

తన లవర్ గురించి శృతి మాట్లాడుతూ..'శంతను ఎంతో టాలెంట్ ఉన్నవాడు. నన్ను బాగా నవ్విస్తాడు. అయితే కాస్త వింతగా కూడా ప్రవర్తిస్తాడు. నన్ను ఎక్కువగా ఇష్టపడతాడు. అతని కళ్లు అంటే చాలా ఇష్టం. ' అంటూ తన ప్రేమను వెల్లడించింది. ఎవరు ఎక్కువగా సారీ చెబుతుంటారని నెటిజన్స్ ప్రశ్నించగా..  ఎప్పుడైనా సరే తాను సారీ చెప్పాల్సిందేనని చెప్పుకొచ్చింది.  కాగా.. ఈ ఏడాదిలో శృతిహాసన్ నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: ముద్దులతో రెచ్చిపోయిన శృతిహాసన్.. మండిపడుతున్న నెటిజన్స్..!)


 

Advertisement
 
Advertisement
Advertisement