Shruti Haasan Kissing With Boyfriend Shantanu Video Goes Viral - Sakshi
Sakshi News home page

Shruti Haasan: సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?.. శృతిహాసన్‌పై నెటిజన్స్ ఫైర్

Mar 12 2023 5:44 PM | Updated on Mar 12 2023 6:24 PM

Shruti Haasan Kissing With Boyfriend Video Shantanu Goes Viral - Sakshi

తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటి శృతిహాసన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటోంది. అయితే తాజాగా ఈ కోలీవుడ్ భామ శాంతను హజారికాతో ఉన్న వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకుంది. అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వీడియోలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని మండపడుతున్నారు. మరికొందరేమో దారుణమైన కామెంట్స్ చేశారు. 

(ఇది చదవండి: వామ్మో.. ఆస్కార్‌ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్‌ ఏంటంటే..)

శృతిహాసన్ తన ఇన్‌స్టాలో వీడియో షేర్ చేస్తూ..' శాంతను తిరిగి ఇంటికి వచ్చాడు. అతను నా జీవితంలోకి వచ్చాక శాశ్వతంగా మార్చేశాడు.' అంటూ శాంతనుకు ముద్దు పెడుతున్న వీడియోను పోస్ట్ చేసింది. అది చూసిన నెటిజన్లు దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో రొమాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేయడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement