Shraddha Das Saree Look: ఆ వేటను లైఫ్‌లో మరచిపోలేనంటున్న హీరోయిన్‌

Shraddha Das Designer Wear Saree By Aditi Deshpande, Details Inside - Sakshi

నాయికా.. ప్రతి నాయికా.. పాత్ర ఏంటి అనేది కాదు.. సినిమాలో ఆ పాత్ర ప్రాధాన్యమెంత అనేదే చూస్తుంది శ్రద్ధా దాస్‌. అందుకే గ్లామర్‌ రోల్స్‌కే పరిమితం కాకుండా నటిగా నిలబడింది. ఇన్నేళ్లయినా ఇంకా లైమ్‌లైట్‌లో ఉంది. ఆ పాపులారిటీకి కారణం.. నటన పట్ల ఆమెకున్న ప్యాషన్‌తో పాటు ఆమెను ఫ్యాషనబుల్‌గా చూపిస్తున్న ఈ బ్రాండ్స్‌ కూడా...

జ్యూయెలరీ
ఇయర్‌ రింగ్స్‌ 
బ్రాండ్‌: ది జ్యువెల్‌ గ్యాలరీ
ధర: రూ. 6,600

చీర 
డిజైనర్‌: ప్లష్‌ బై అదితి దేశ్‌పాండే
ధర: రూ. 11,000

బ్రాండ్‌ వాల్యూ: ప్లష్‌ బై అదితి దేశ్‌పాండే
ఫ్యాషన్, సౌకర్యాలను బ్యాలెన్స్‌ చేసే బ్రాండే ప్లష్‌ బై అదితి దేశ్‌పాండే. అందుకే ఇది కేవలం అమ్మాయిల ఒంపుసొంపులకు అనుగుణంగా రూపొందించే డిజైన్స్‌కే పరిమితం కాలేదు. ఆధునిక అమ్మాయిల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే దుస్తులను డిజైన్‌ చేసే సృజనను, కళనూ ఒడిసిపట్టుకుంది. ఆ క్రియేటర్‌ ఎవరో చెప్పాల్సిన పనిలేదు.. బ్రాండ్‌ నేమ్‌లోనే ఉంది.. అవును.. ఆమే.. అదితి దేశ్‌పాండే. ఈ డిజైనర్‌ దుస్తులు ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. ధరలూ అందుబాటులోనే ఉంటాయి. 

ది జ్యువెల్‌ గ్యాలరీ
ఇది లండన్, జెనీవా బేస్డ్‌ జ్యుయెలరీ బ్రాండ్‌. పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన డిజైన్స్‌.. దీని ప్రత్యేకత. నాణ్యత, డిజైన్స్‌లో కళాత్మకతే ఈ బ్రాండ్‌ డిమాండ్‌ను పెంచుతున్నాయి. క్లయింట్స్‌ను క్యూలో నిలబెడుతున్నాయి. సరసమైన ధరలు.. ఆన్‌లైన్‌లో అందుబాటు ఈ బ్రాండ్‌ పట్ల క్రేజ్‌ను పెంచే ఇతర కారణాలు.

నేను పుట్టింది, పెరిగింది ముంబైలోనే అయినా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీతో కూడా నా జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. అది మా అమ్మమ్మ వాళ్లూరు. రంగురాళ్లకు ప్రసిద్ధి ఆ ఊరు. చిన్నప్పుడు సమ్మర్‌ హాలిడేస్‌కి వెళ్లేవాళ్లం. వెళ్లినప్పటి నుంచి తిరిగి ముంబై వచ్చేదాకా ఆ ఊళ్లో మా రంగు రాళ్ల వేట సాగేది. రకరకాల రంగురాళ్లను ఏరుకొచ్చేవాళ్లం. ఆ వేటను లైఫ్‌లో మరచిపోలేను! 
– శ్రద్ధా దాస్‌

చదవండి: తనకన్నా ఆరేళ్లు చిన్నవాడితో ఆరేళ్లు డేటింగ్‌, పిల్లలు పుట్టాక పెళ్లి
రాకెట్రీలో ఆ సీన్‌ మళ్లీ మళ్లీ చూశానన్న నెటిజన్‌, హీరో దెబ్బకు ట్వీట్‌ డిలీట్‌!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top