ఇరవయ్యేళ్ల తర్వాత యాభైఆరవ చిత్రంలో...  | Shobana and Mohanlal to reunite for a film after 20 years | Sakshi
Sakshi News home page

ఇరవయ్యేళ్ల తర్వాత యాభైఆరవ చిత్రంలో... 

Apr 20 2024 1:38 AM | Updated on Apr 20 2024 1:38 AM

Shobana and Mohanlal to reunite for a film after 20 years - Sakshi

మాలీవుడ్‌ సిల్వర్‌ స్క్రీన్‌ హిట్‌ పెయిర్‌ మోహన్‌లాల్, శోభనల జోడీ రిపీట్‌ కానుంది. మోహన్‌లాల్‌ హీరోగా తరుణ్‌ మూర్తి దర్శకత్వంలో ఎమ్‌. రంజిత్‌ ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో శోభన కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాలో భాగమైనట్లుగా సోషల్‌ మీడియాలో శోభన ఓ వీడియో షేర్‌ చేశారు. ‘‘మోహన్‌లాల్‌గారి ఈ 360వ సినిమాలో నేను నటించనున్నాను. నాకు గుర్తు ఉన్నంతవరకు ఆయనతో నేను కలిసి చేయబోతున్న 56వ చిత్రం ఇది’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు శోభన. ఇక 1985లో వచ్చిన మలయాళ చిత్రం ‘అవిడతే పోలే ఇవిడెయుమ్‌’లో తొలిసారి కలిసి నటించారు మోహన్‌లాల్, శోభన.

ఆ తర్వాత ఈ ఇద్దరూ ‘మణిచిత్ర తాళు’ (ఈ సినిమా ఆధారంగానే ‘చంద్రముఖి’ తీశారు), ‘నాడోడిక్కట్టు’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించారు. 1994లో వచ్చిన మలయాళ చిత్రం ‘తేన్మావిన్‌ కొంబాట్‌’లో మెహన్‌లాల్, శోభన లీడ్‌ రోల్స్‌లో నటించారు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మోహన్‌లాల్, శోభన కలిసి నటించనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. 2009లో వచ్చిన మలయాళ చిత్రం ‘సాగర్‌ ఆలియాస్‌ జాకీ రీలోడెడ్‌’లో మోహన్‌లాల్‌ హీరోగా నటించగా, శోభన ఓ అతిథి పాత్ర చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement