నా లైఫ్‌లో ఎన్నో లవ్‌స్టోరీలున్నాయి.. అందుకనే విడిపోయాం! | Shekhar Kapur Open Up About His Relationships, Ex Wife Suchitra Krishnamoorthi Comments Viral On Him - Sakshi
Sakshi News home page

Shekhar Kapur: అప్పట్లో రిలేషన్స్‌.. ఇప్పుడు వాళ్లంతా ఫ్రెండ్స్‌..

Feb 13 2024 11:57 AM | Updated on Feb 13 2024 1:08 PM

Shekhar Kapur Open Up About His Relationships, Ex Wife Suchitra Krishnamoorthi Comments Viral On Him - Sakshi

నా జీవితంలో ఎన్నో రిలేషన్‌షిప్స్‌ ఉన్నాయి. లవ్‌ స్టోరీలు లేకుండా నా లైఫే లేదు. అయితే గౌరవం ఇచ్చిపుచ్చుకోని మనుషులతో మాత్రం కలిసుండలేదు. రానురానూ రి

సినిమా ఇండస్ట్రీలో పెళ్లి- విడాకులు జంట పదంగా మారిపోయింది. ఎంతో అన్యోన్యంగా కనిపించే దంపతులు కూడా సడన్‌గా విడిపోతున్నట్లు చెప్పి షాకిస్తున్నారు. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవడం.. సగం జీవితం కూడా కలిసి ప్రయాణించకుండానే వేరుపడటం సర్వసాధారణమైపోయింది. ప్రముఖ గాయని, నటి సుచిత్రా కృష్ణమూర్తి - దర్శకుడు శేఖర్‌ కపూర్‌ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

అన్నీ తెలిసీ పెళ్లి
సుచిత్ర కన్నా శేఖర్‌ 30 ఏళ్లు పెద్దవాడు. అప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాడు. అయినా అతడితో ప్రేమలో పడిందీ సింగర్‌. ఇంట్లో ఒప్పుకోకపోతే వారిని ఎదిరించి మరీ తనను పెళ్లాడింది. ఈ దంపతుల ప్రేమకు గుర్తుగా ఒక కూతురు పుట్టింది. కానీ 2007లో వీరు విడిపోయారు. హీరోయిన్‌ ప్రీతి జింటా వల్లే తాము విడాకులు తీసుకున్నామని ఆరోపించింది సుచిత్ర. ఇటీవలే మరోసారి విడాకులపై స్పందిస్తూ.. అతడి ప్రేమలో నిజాయితీ లేదని విమర్శించింది.

ప్రేమ కథలతోనే సాగిన జీవితం
తాజాగా శేఖర్‌ తను సాగించిన ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నా జీవితంలో ఎన్నో రిలేషన్‌షిప్స్‌ ఉన్నాయి. లవ్‌ స్టోరీలు లేకుండా నా లైఫే లేదు. అయితే గౌరవం ఇచ్చిపుచ్చుకోని మనుషులతో మాత్రం ఎన్నడూ కలిసుండలేదు. కానీ రానురానూ రిలేషన్‌షిప్‌కు అర్థాలే మారిపోతూ వచ్చాయి. రొమాన్స్‌ ఉండట్లే, జీవితాంతం కలిసుందామన్న మాటలూ ఉండట్లే.. కానీ ప్రేమించుకుంటున్నారు. అయినా ఒకరి గురించి ఒకరు క్షుణ్ణంగా తెలుసుకుని కనెక్ట్‌ అయ్యాక ఎందుకని విడిపోతారు? గౌరవమర్యాదలకు లోటు వచ్చినప్పుడే అలా జరుగుతుంది.

అందరూ స్నేహితులే
నేనైతే నా మాజీలందరినీ గౌరవించాను, గౌరవిస్తున్నాను. అందుకే ఇప్పటికీ వారంతా నా స్నేహితులుగా ఉన్నారు' అని చెప్పుకొచ్చాడు. కాగా శేఖర్‌ కపూర్‌ దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ పలు చిత్రాల్లో తెరపై మెప్పించాడు. నిర్మాతగా దిల్‌ సే, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా ద గురు సినిమాలు చేశాడు.

చదవండి: ధనుష్‌ పాటపై సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేసిన మాజీ భార్య

Advertisement
 
Advertisement
Advertisement