Shekhar Kapur
-
మా వంటబ్బాయి చెప్పిన కథ విని ఆశ్చర్యపోయా: దర్శకుడు శేఖర్ కపూర్
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్’ (వేవ్స్)– 2025’ ని ఈ నెల 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాలుగురోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్ ఆదివారంతో ముగిసింది. ‘వేవ్స్’ సమ్మిట్‌కి హాజరైన ప్రముఖ దర్శకుడు, ‘మిస్టర్ ఇండియా’ చిత్రం ఫేమ్ శేఖర్ కపూర్(Shekhar Kapur ) మాట్లాడుతూ–‘‘నా దృష్టిలో ఏఐ అనేది పెద్ద డెమొక్రటిక్ టూల్. వినోదరంగ పురోగతి కోసం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది చూడాలి కానీ, అతిగా భయపడడం అనవసరం. ఉదాహరణకు, నా ‘మిస్టర్ ఇండియా–2’(Mr India 2 ) కోసం కథ ఆలోచిస్తూ ఉంటే, ఒకరోజు మా వంటబ్బాయి అద్భుతమైన కథ చెప్పాడు. ఏ అనుభవం లేని అతనికి ఆ ఆలోచన ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతూ అడిగా. ‘చాట్ జీపీటీలో అడిగితే చెప్పింద’ని మా కుక్ జవాబు ఇచ్చేసరికి ఆశ్చర్యపోవడం నా వంతు అయింది’’ అని తన వ్యక్తిగత అనుభవం పంచుకున్నారు. ‘‘అయితే ఏఐ, చాట్ జీపీటీలు ఎంత గొప్పవైనా, మనం వాటి మీద అతిగా ఆధారపడితే బద్ధకం పెరుగుతుంది. ఎందుకూ కొరగాకుండా పోతాం. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా మానవ మేధనూ, ఒరిజినాలిటీనీ అవి అధిగమించలేవు’’ అని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అన్ని రంగాలనూ కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావితం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వెండితెరపై కథ, కథనం ఎలా మారనుంది? అనే ఆసక్తికరమైన ప్రశ్నకు శేఖర్ కపూర్ దగ్గర ఉన్న జవాబు ఏంటి? ‘వేవ్స్’కు హాజరైన ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ–‘‘ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా దాన్ని అందిపుచ్చుకోవాలి. లేదంటే మనం వెనకబడిపోతాం’’ అన్నారు. ‘‘మారుతున్న కాలంతో పాటు వస్తున్న అనేక కొత్త టెక్నాలజీలు, మాధ్యమాలు తమవైన ఆడియన్స్‌ను సృష్టించుకుంటాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో వెండితెరపై వినోదం చూడడం తక్కువ అవుతోంది. మహా అయితే 2 శాతం ఉంటుందేమో! ఇతరేతర మాధ్యమాల్లో చూస్తున్నారు, వినోదం పొందుతున్నారు. ఇది గమనించి దానికి తగ్గట్టుగా మనమూ మారాలి’’ అని అభిప్రాపడ్డారు. ఇంకా ఆయన మాట్లాడుతూ–‘‘ఏఐ అనేది అప్పటికే అందుబాటులో ఉన్న అపరిమిత సమాచారం ఆధారంగా నడుస్తుంది. కానీ మానవ జీవితం రేపు ఎలా ఉంటుందో ముందే తెలియకుండా మిస్టరీగా అనునిత్యం ముందుకు సాగుతుంది. జీవితంలోని విశేషం అదే’’ అని అంతర్జాతీయంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌కు సైతం నామినేటైన ఈ దర్శకుడు విశ్లేషించారు. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
అమ్మానాన్న విడిపోయినప్పుడు హ్యాపీగా ఉన్నా: నటి
పేరెంట్స్ విడాకుల వల్ల తను సంతోషంగానే ఉన్నానంటోంది నటి కావేరి కపూర్ (Kaveri Kapur). కాకపోతే అది తర్వాతి కాలంలో తన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిందని చెప్తోంది. డైరెక్టర్ శేఖర్ కపూర్- నటి, సింగర్ సుచిత్రా కృష్ణమూర్తి (Suchitra Krishnamoorthi)ల కూతురే కావేరి. బాబీ ఔర్ రిషికి లవ్ స్టోరీ అనే హిందీ సినిమాతో వెండితెరకు నటిగా పరిచయమైంది.విడాకులు తీసుకున్నప్పుడు హ్యాపీనేతాజాగా ఓ ఇంటర్వ్యూలో కావేరి మాట్లాడుతూ.. అమ్మానాన్న విడిపోయినప్పుడు నేనంతగా బాధపడలేదు. వాళ్లు విడాకులు తీసుకున్నప్పుడు నేను హ్యాపీగానే ఉన్నాను. కానీ రానురానూ తేడా గమనించాను. పేరెంట్స్ విడాకులు నా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించాయి. పెద్దయ్యే కొద్దీ మానసికంగా చాలా ఇబ్బందిపడ్డాను.ఇప్పటికీ మానసికంగా..ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను. ఇదొక ప్రక్రియలా కొనసాగుతోంది. అలాగే నాకు ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) ఉంది. ప్రస్తుతం వీటన్నింటి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాను. పూర్తిగా బయటపడేందుకు ఇంకాస్త సమయం పడుతుందని భావిస్తున్నాను. శేఖర్ కపూర్- సుచిత్ర కృష్ణమూర్తి 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2001లో కావేరి జన్మించింది. 12 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 2007లో విడాకులు తీసుకున్నారు.చదవండి: ప్రభుదేవా కన్సర్ట్.. కనీస గౌరవం లేదు, వివక్ష చూపిస్తున్నారు: నటి -
ప్రతిభా భూషణాలు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించింది. కళల విభాగంలో నటులు నందమూరి బాలకృష్ణ, అజిత్, అనంత్,నాగ్, నటి శోభన, దర్శకుడు శేఖర్ కపూర్లకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.పట్టుదలే పద్మభూషణ్ వరకూ...అజిత్ తండ్రి సుబ్రమణి తమిళనాడులో పుట్టారు. అయితే కేరళ మూలాలు ఉన్న కుటుంబం. తల్లి మోహినిదిపాకిస్థాన్ లోని కరాచీ. కోల్‌కతాలో స్థిరపడ్డ సింధీ కుటుంబం. కాగా కోల్‌కతాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో మోహినితో ప్రేమలో పడ్డారు సుబ్రమణి. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సికిందరాబాద్‌లోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం రావడంతో ఇక్కడ ఐదేళ్లు ఉంది ఆ కుటుంబం. వీరికి ముగ్గురు కుమారులు. అజిత్ రెండో కొడుకు. అజిత్‌కి ఏడాదిన్నర వచ్చాక చెన్నైలో స్థిరపడ్డారు. చదువులో లాస్ట్... అజిత్‌కి పెద్దగా చదువు అబ్బలేదు. అయితే క్రికెట్లో బెస్ట్. ఎన్ సీసీలోనూ మంచి ర్యాంకు సంపాదించాడు. కానీ సరిగ్గా చదవకపోవడంతో స్కూలు యాజమాన్యం అజిత్‌ని పదో తరగతి పరీక్షలు రాయడానికి అనుమతించకపోవడంతోపాటు స్కూలు నుంచి పంపించేసింది. ఆ తర్వాత రాయల్ ఎన్ ఫీల్డ్ బైకు షోరూమ్‌లో మెకానిక్ అప్రెంటిస్‌గా చేరడం, తల్లిదండ్రుల ్రపోద్భలంతో గార్మెంట్ ఎక్స్పోర్ట్ బిజినెస్‌లో చేరడం, అవి చేస్తూనే రేసుల్లోపాల్గొనడం, ఇలా సాగింది. ఇక ఎవరో ఇచ్చిన సలహాతో సినిమాల్లో ప్రయత్నించాలనుకున్నారు అజిత్. ప్రముఖ నటుడు–రచయిత–దర్శకుడు గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ‘ప్రేమ పుస్తకం’ సినిమా ఆరంభమైంది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పడంతో నిర్మాత పూర్ణచంద్రరావు అజిత్‌ని హీరోగా తీసుకున్నారు. అయితే శ్రీనివాస్ మృతి చెందడంతో షూటింగ్ ఆగింది. ఆ తర్వాత ఆ చిత్రాన్ని మారుతీరావు పూర్తి చేశారు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు.‘ఆశై’తో హిట్ ట్రాక్: ఎస్పీబీయే తమిళ దర్శకుడు సెల్వకి చెప్పి, అజిత్‌కి ‘అమరావతి’లో హీరోగా నటించే చాన్స్ ఇప్పించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతోపాటు లుక్స్, నటన పరంగా అజిత్‌కి మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఓ రేసుకి సంబంధించిన ట్రయల్కి వెళుతుండగా జరిగిన ప్రమాదంలో వెన్నెముకకి సర్జరీ జరిగింది. ఆ తర్వాత ‘ఆశై’ (1995)తో అజిత్ కెరీర్ హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ తర్వాత చేసిన ‘కాదల్ కోటై్ట’ (ప్రేమ లేఖ), ‘వాలి’ వంటివి సూపర్ హిట్. సినిమాలు చేస్తూనే బైక్, కారు రేస్లకూ వెళుతుంటారు. ఇటీవల కారు రేసులో అజిత్ టీమ్ విజయం సాధించింది. ప్రస్తుతం అజిత్ నటిస్తున్న చిత్రాల్లో ‘విడాముయర్చి’ తెలుగులో ‘పట్టుదల’గా విడుదల కానుంది. జీవితంలోనూ అజిత్‌కి పట్టుదల ఎక్కువ. ఆ పట్టుదలే నేడు ‘పద్మభూషణ్’ వరకూ తీసుకొచ్చింది. ఇక ‘అమర్కలమ్’ (1999) సినిమాలో నటించినప్పుడు అజిత్, హీరోయిన్ షాలిని ప్రేమలో పడ్డారు. 2000లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.యాక్టివ్‌గా యాక్టింగ్ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్ (76) గురించి నేటి తరానికి చెప్పాలంటే ‘కేజీఎఫ్’ సినిమా చాలు. ‘ప్రేమ లేఖలు’ (1977), ఆ తర్వాత ‘శాంతి క్రాంతి’, ‘శంఖారావం’ వంటి చిత్రాలతో నాటి తరం తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకు బాగా గుర్తింపు ఉంది. ఇక నేటితరం తెలుగు ప్రేక్షకులకు ‘కేజీఎఫ్’ (2018) ద్వారా దగ్గరయ్యారు అనంత్ నాగ్. ఈ సినిమాలో ఆయన రచయితపాత్ర చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘సంకల్ప’ (1973) చిత్రంతో కన్నడంలో నటుడిగా పరిచయం అయ్యారు అనంత్ నాగ్. ఆ చిత్రం పలు అవార్డులు సాధించడంతోపాటు నటుడిగానూ గుర్తింపు తెచ్చిపెట్టింది. 50 ఏళ్ల నట జీవితంలో దాదాపు రెండువందల కన్నడ చిత్రాల్లోనూ, హిందీ, మరాఠీ, తెలుగు, మలయాళం, ఆంగ్లంలో దాదాపు వంద చిత్రాలు... మొత్తంగా మూడ వందల చిత్రాల్లో నటించారు అనంత్ నాగ్. కొన్ని సినిమాలు నిర్మించారు కూడా. పలు టీవీ షోల్లోనూ నటించారు. 76 ఏళ్ల వయసులోనూ యాక్టివ్‌గా ఉంటూ... సినిమాలు చేస్తున్నారు.కొత్త పంథాకి భూషణంశేఖర్ కపూర్ భారతీయ సినిమా రంగానికి, ముఖ్యంగా బాలీవుడ్‌కి మ్యాజికల్ టచ్ ఇచ్చిన నిన్నటి తరం దర్శక–నిర్మాత. చేసినవి కొన్ని సినిమాలే అయినా, సంపాదించిన కీర్తి, భారతీయ సినిమాకి తెచ్చిపెట్టిన గౌరవం గొప్పవి. ఇప్పటిపాకిస్థాన్లోని లాహోర్‌లో జన్మించారు. సినిమాల మీద మక్కువతో ముంబయి చేరుకున్నారు. మొదట నటుడుగా ప్రయత్నాలు చేశారు. దేవానంద్ ‘ఇష్క్ ఇష్క్ ఇష్క్’లో నటించారు. దూరదర్శన్ తొలిదశలో వచ్చిన ‘ఖాన్ దాన్’ మొదలైన టీవీ సీరియల్స్‌లో ప్రేక్షకులకి గుర్తుండిపోయే కొన్నిపాత్రలు చేశారు. ‘మాసూమ్’తో డైరెక్టర్‌గా...‘మాసూమ్’ సినిమాతో డైరెక్టర్‌గా తన కెరీర్‌ని కొత్త దారి పట్టించారు. ‘ది మేన్, విమెన్ అండ్ చైల్డ్’ అనే ఇంగ్లిష్ నవల ఆధారంగా శేఖర్ కపూర్ తీసిన సినిమా అది. భారతీయ సినిమాకి తెలియని కొత్త కథేమీ కాదు. కానీ సెన్సిబుల్‌గా కథని చెప్పారు. దాంతో శేఖర్ కపూర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.స్టయిల్ మార్చేశారుఇండియాలో అన్ని వర్గాల ఆడియన్స్‌కి శేఖర్ కపూర్‌ని ఓ బ్రాండ్‌గా మార్చిన సినిమా ‘మిస్టర్ ఇండియా’. ‘ది ఇన్విజిబుల్ మేన్’ అనే కామిక్స్ స్ఫూర్తితో ‘మిస్టర్ ఇండియా’ కథ రూపొందింది. హిందీలో అదృశ్య వ్యక్తి హీరోగా అంతకు మునుపు కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఈ ఐడియానిపాపులర్ పల్ప్ ఫిక్షన్ చేసిన ఘనత శేఖర్ కపూర్‌దే. కమర్షియల్ కథలను కొత్తగా చెప్పే డైరెక్టర్ వచ్చాడని బాలీవుడ్ మురిసిపోయినంత సేపు పట్టలేదు – శేఖర్ కపూర్ తన స్టయిల్ మార్చేశారు.బాండిట్ క్వీన్‌కి అడ్డంకులు... అవార్డులుచంబల్ లోయకి చెందిన బందిపోటు పూలన్ దేవి జీవిత గాథ ఆధారంగా ‘బాండిట్ క్వీన్’ సినిమా తీశారు శేఖర్. సెన్సేషనల్ హిట్ అయిన ఆ సినిమా పలు సెన్సార్ సమస్యలు ఎదుర్కొంది. రిలీజ్ అయ్యాక చాలా అవార్డులు గెలుచుకుంది. శేఖర్ కపూర్ దృక్పథాన్ని మార్చింది. బ్రిటన్ మహారాణి జీవితం ఆధారంగా ‘ఎలిజిబెత్’ సినిమా తీశారు. అంతర్జాతీయంగా శేఖర్ కపూర్ పేరు మారుమోగిపోయింది. ఆ చిత్రం ఆస్కార్ అవార్డ్స్‌లో ఏడు నామినేషన్లు దక్కించుకుంది. ఆ తర్వాత ఆయన ‘ది ఫోర్ ఫెదర్స్’ (2002), ‘ఎలిజెబెత్’కి సీక్వెల్‌గా ‘ఎలిజెబెత్: ది గోల్డెన్ ఏజ్’ (2007)ని తెరకెక్కించారు. ఎన్నో ఏళ్ళ క్రితమే భారతీయ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన శేఖర్ కపూర్ పద్మ భూషణుడు కావడం చిత్రసీమకు లభించిన గిఫ్ట్.– తోట ప్రసాద్, ప్రముఖ సినీ రచయితఆమె కెరీర్ శోభాయమానంకేరళలోని త్రివేండ్రంలో (ప్రస్తుతం తిరువనంతపురం) 1970 మార్చి 21న జన్మించారు శోభన. ఆమె పూర్తి పేరు శోభనా చంద్రకుమార్ పిళ్లై. నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభనకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం అంటే చాలా ఇష్టం. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా అక్కినేని నాగార్జున హీరోగా పరిచయమైన ‘విక్రమ్’ (1986) సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమయ్యారు శోభన. ఆ తర్వాత కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మోహన్‌బాబు, రజనీకాంత్, మోహన్ లాల్, రాజేంద్ర ప్రసాద్, శరత్ బాబు, కార్తీక్ వంటి హీరోల సరసన నటించారు.మాతృభాష మలయాళంతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సినిమాలు చేసిన శోభన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ‘రుద్రవీణ, అభినందన, అల్లుడుగారు, అప్పుల అప్పారావ్, రౌడీగారి పెళ్లాం, రౌడీ అల్లుడు’ వంటి పలు తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. నటనలోనే కాకుండా నాట్యంలో కూడా అద్భుతంగా రాణించారు. చెన్నైలోని చిదంబరం నాట్య అకాడమీలో శిక్షణ పొందిన ఆమె క్లాసికల్ డ్యాన్సర్‌గానూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఆమె దగ్గర నటనలోనూ, నాట్యంలోను శిక్షణ తీసుకుంటుండటం విశేషం. 1994లో ‘కళార్పణ’ అనే సంస్థను నెలకొల్పారు శోభన. ప్రస్తుతం ఆమె పెద్దగా సినిమాలు చేయడం లేదు. వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని కళకు అంకితం చేశారు. ఓ వైపు దేశ విదేశాల్లో క్లాసికల్ డ్యాన్స్ షోలు చేస్తూ.. మరోవైపు డ్యాన్స్ స్కూల్ నడిపిస్తున్నారామె.నటసింహ కీర్తి కిరీటంలో...నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 1960 జూన్ 10న చెన్నైలో జన్మించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘తాతమ్మ కల’ చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేశారు బాలకృష్ణ. 1974 ఆగస్టు 30న ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో నటించే నాటికి బాలకృష్ణ వయస్సు 14 ఏళ్లు. ఆ తర్వాత ‘రామ్ రహీమ్, అన్నదమ్ముల అనుబంధం, దాన వీర శూర కర్ణ’ వంటి పలు చిత్రాల్లో నటించారు.‘సాహసమే జీవితం’తో హీరోగా1984 జూన్ 1న రిలీజైన ‘సాహసమే జీవితం’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు బాలకృష్ణ. ఆ తర్వాత ‘డిస్కో రాజా, జననీ జన్మభూమి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం 1984 సెప్టెంబరు 7న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో సోలో హీరోగా స్థిరపడ్డారాయన. ఆ తర్వాత ‘కథానాయకుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్ స్పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, సమర సింహారెడ్డి, నరసింహæనాయుడు, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, లయన్, పైసా వసూల్, అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారాయన. 50 ఏళ్ల నట ప్రస్థానంలో...‘భైరవ ద్వీపం, శ్రీకష్ణార్జున విజయం,పాండురంగడు, శ్రీరామ రాజ్యం’ వంటి చిత్రాలతో పౌరాణిక, జానపద చిత్రాల్లో తండ్రికి తగ్గ తనయుడిగానూ నిరూపించుకున్నారు బాలకృష్ణ. నటుడిగా పవర్ఫుల్ డైలాగులు చెప్పడంలోనూ, పౌరుషాన్ని గాంభీర్యంగా ప్రదర్శించడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారాయన. ఇప్పటివరకు 110 సినిమాల్లో నటించారు. వాటిలో చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలు ఉన్నాయి. నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు బాలకృష్ణ. అలాగే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గానూ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2: తాండవం’ సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ. బాలకృష్ణకి భార్య వసుంధరా దేవి, కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలో హీరోగా పరిచయం కానున్నారు. -
IFFI : ఘనంగా గోవా సినిమా పండుగ ప్రారంభం.. సందడి చేసిన నాగ్, ఇతరులు (ఫొటోలు)
-
నా లైఫ్‌లో ఎన్నో లవ్స్టోరీలున్నాయి.. అందుకనే విడిపోయాం!
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి- విడాకులు జంట పదంగా మారిపోయింది. ఎంతో అన్యోన్యంగా కనిపించే దంపతులు కూడా సడన్‌గా విడిపోతున్నట్లు చెప్పి షాకిస్తున్నారు. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవడం.. సగం జీవితం కూడా కలిసి ప్రయాణించకుండానే వేరుపడటం సర్వసాధారణమైపోయింది. ప్రముఖ గాయని, నటి సుచిత్రా కృష్ణమూర్తి - దర్శకుడు శేఖర్ కపూర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అన్నీ తెలిసీ పెళ్లి సుచిత్ర కన్నా శేఖర్ 30 ఏళ్లు పెద్దవాడు. అప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాడు. అయినా అతడితో ప్రేమలో పడిందీ సింగర్. ఇంట్లో ఒప్పుకోకపోతే వారిని ఎదిరించి మరీ తనను పెళ్లాడింది. ఈ దంపతుల ప్రేమకు గుర్తుగా ఒక కూతురు పుట్టింది. కానీ 2007లో వీరు విడిపోయారు. హీరోయిన్ ప్రీతి జింటా వల్లే తాము విడాకులు తీసుకున్నామని ఆరోపించింది సుచిత్ర. ఇటీవలే మరోసారి విడాకులపై స్పందిస్తూ.. అతడి ప్రేమలో నిజాయితీ లేదని విమర్శించింది. ప్రేమ కథలతోనే సాగిన జీవితం తాజాగా శేఖర్ తను సాగించిన ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నా జీవితంలో ఎన్నో రిలేషన్షిప్స్ ఉన్నాయి. లవ్ స్టోరీలు లేకుండా నా లైఫే లేదు. అయితే గౌరవం ఇచ్చిపుచ్చుకోని మనుషులతో మాత్రం ఎన్నడూ కలిసుండలేదు. కానీ రానురానూ రిలేషన్‌షిప్‌కు అర్థాలే మారిపోతూ వచ్చాయి. రొమాన్స్ ఉండట్లే, జీవితాంతం కలిసుందామన్న మాటలూ ఉండట్లే.. కానీ ప్రేమించుకుంటున్నారు. అయినా ఒకరి గురించి ఒకరు క్షుణ్ణంగా తెలుసుకుని కనెక్ట్ అయ్యాక ఎందుకని విడిపోతారు? గౌరవమర్యాదలకు లోటు వచ్చినప్పుడే అలా జరుగుతుంది. అందరూ స్నేహితులే నేనైతే నా మాజీలందరినీ గౌరవించాను, గౌరవిస్తున్నాను. అందుకే ఇప్పటికీ వారంతా నా స్నేహితులుగా ఉన్నారు' అని చెప్పుకొచ్చాడు. కాగా శేఖర్ కపూర్ దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ పలు చిత్రాల్లో తెరపై మెప్పించాడు. నిర్మాతగా దిల్ సే, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ద గురు సినిమాలు చేశాడు. చదవండి: ధనుష్ పాటపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన మాజీ భార్య -
ఎఫ్టీఐఐ ప్రెసిడెంట్‌గా శేఖర్ కపూర్
ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్‌కి కొత్త బాధ్యత లభించింది. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ)కు ప్రెసిడెంట్‌గా ఆయన నియమితులయ్యారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘ఇదో సరికొత్త బాధ్యత. అందరి సహకారంతో ముందుకెళ్లాలనుకుంటున్నాను’’ అన్నారు శేఖర్ కపూర్. మార్చి 2023 వరకూ ఆయన పదవీకాలం కొసాగుతుంది. -
అందుకే కోర్టును ఆశ్రయించా: నటి
గాయని, నటి, రచయిత, చిత్రకారిణి.. ఇలా అన్నిరంగాల్లో అందెవేసిన చేయి సుచిత్రా కృష్ణమూర్తిది. 1997లో ఆమె ప్రసిద్ధ దర్శకుడు శేఖర్‌కపూర్‌ను వివాహమాడారు. వీరికి కావేరీ అనే కూతురు కూడా ఉంది. ఆమె తల్లి నుంచి పుణికి తెచ్చుకున్న కళతో మ్యూజిక్ రంగంలో సత్తా చాటుతోంది. కాగా గత కొన్నేళ్ల క్రితమే సుచిత్రా దంపతులు విడిపోయారు. దీంతో కావేరి బాధ్యతలు భుజాన మోస్తూ సుచిత్ర సింగిల్ పేరెంట్‌గా బతుకుతున్నారు. ఇదిలా ఉండగా... ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న మూడు పడక గదుల ఫ్లాట్‌లో నటుడు కబీర్ బేడి, భార్యతో కలిసి అద్దెకు ఉంటున్నారు. (రాంగోపాల్‌వర్మను పెళ్లి చేసుకోవాలనుకున్నా: సుచిత్ర) అయితే ఈ ఫ్లాట్ తన మాజీ భర్త, దర్శకుడు శేఖర్ కపూర్‌కు చెందినదని.. చట్ట ప్రకారం ఇది తమ కుమార్తె కావేరికి చెందుతుందని సుచిత్ర వాదిస్తూ వచ్చారు. తన కూతురు ఉండటానికి ఇల్లు లేదని చెబుతున్నా నాలుగేళ్లుగా కబీర్ బేడి ఆ ఇంటిని ఖాళీచేయడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక లాభం లేదనుకున్న ఆమె కోర్టును ఆశ్రయించారు. మాజీ భర్త నుంచి కూతురికి రావాల్సిన ఆస్తి కోసం న్యాయపోరాటానికి దిగారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. మున్ముందు తన కూతురికి ఎలాంటి సమస్యలు తలెత్తకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇప్పటికే దీనివల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నానని, ఇంతకు మించి ఏమీ చెప్పలేన’ని మాట్లాడటానికి నిరాకరించారు. ఇక ఈ విషయమై చాలాసార్లు శేఖర్‌కపూర్‌కు నోటీసులు పంపించినా స్పందన లేకపోవడంతోనే ఆమె కోర్టును ఆశ్రయించారని సమాచారం. -
‘ఆ విషయంలో హిందీ దర్శకులు ఫెయిల్’
సూపర్‌స్టార్ రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌ల కలయికలో శంకర్ రూపొందించిన విజువల వండర్ 2.ఓ వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ రెండు వారాల్లో రూ. 700 కోట్లు వసూలు చేసింది. 2. ఓనే కాకుండా గతంలో తెలుగులో వచ్చిన ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ భారత సిని చరిత్రలో రికార్డు సృష్టించాయి. వసూళ్ల పరంగా సునామీలా దూసుకు పోయాయి. మరో పక్క బాలీవుడ్లో భారీ అంచానలతో తెరకెక్కిన ఆమిర్ ఖాన్ చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ మాత్రం ఘోర పరాజయాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శేఖర్ కపూర్ ‘భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించడంలో దక్షిణాది దర్శకులు ఎందుకు విజయవంతమవుతున్నారు.. ముంబై దర్శకులు ఎక్కడ ఫెయిలవుతున్నారు..? దక్షిణాది దర్శకులకు సినిమాలంటే చాలా పాషన్. అందుకే వారు బాహుబలి, బాహుబలి 2, 2 పాయింట్ ఓ వంటి భారీ చిత్రాలు తీయగలిగారు అంటూ ట్వీట్ చేశారు. బాహుబలి, 2. ఓ వంటి చిత్రాలు భారతీయ సినిమాల స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాయని పొగిడారు. ఇదే సమయంలో హిందీ దర్శకులు ఇలాంటి ప్రయత్నాల్లో వెనకబడ్డారని చెప్పుకొచ్చారు. దక్షిణాదిలో సినిమాల మీద విపరీతమైన అభిమానం ఉన్నవారే ఇండస్ట్రీకి వస్తారంటూ వ్యాఖ్యానించారు. Why are Directors from Southern India succeeding in large scale films where Directors in Mumbai are failing? Directors from the South certainly show far more passion in their film making. Like in #Bahubali #Bahubali2 #2Point0 — Shekhar Kapur (@shekharkapur) December 12, 2018 గతంలో కరణ్ జోహర్ కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. ‘బాహుబలి 2 : ది కంక్లూజన్’ విడుదలైనప్పుడు కరణ్ జోహర్ ఇలాంటి అద్భుతాలు దక్షిణాది దర్శకులు మాత్రమే చేయగలరు హిందీ పరిశ్రమలో ఇలాంటి సినిమాలు చేయడం చాలా కష్టం. కానీ పారీతోషికం విషయంలో మాత్రం హిందీ వాళ్లు దక్షిణాది వాళ్ల కంటే ఎక్కువ తీసుకుంటారని పేర్కొన్నారు. చైనాలో కూడా 2 పాయింట్ ఓ దూసుకుపోతుంది. బాహుబలి బిగినింగ్, ఆమిర్ ఖాన్ ‘పీకే’ రికార్డలను కూడా బ్రేక్ చేసింది. -
పెద్ద సవాల్
బ్రూస్ లీ... పరిచయం అక్కర్లేని పేరు. మార్షల్ ఆర్ట్స్‌కు పెట్టింది పేరు. ‘ది బిగ్ బాస్’, ‘ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ’, ‘ఎంటర్ ది డ్రాగన్’ వంటి చిత్రాల ద్వారా నటుడిగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. డాక్యుమెంటరీస్ తీశారు. 32 ఏళ్ల వయసులో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. బ్రూస్లీ చనిపోయి 40 ఏళ్లు పైనే అయినప్పటికీ ప్రేక్షకులు మనసుల్లో మిగిలిపోయారు. ఈ మార్షల్ ఆర్ట్స్ కింగ్ జీవితంలో ఎదుర్కొన్న గెలుపు, ఓటములను బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్. రెహమాన్‌ను సంప్రదించగా మ్యూజిక్ డైరెక్టర్‌గా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ‘‘ఈ సినిమా నాకో పెద్ద సవాల్. ఎందుకంటే శేఖర్ కపూర్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాడు’’ అంటున్నారు రెహమాన్. బ్రూస్లీ పాత్రకు సూట్ అయ్యే హీరోని ఎంపిక చేసే పనిలో శేఖర్ ఉన్నారు. -
రాజమౌళికి ప్రఖ్యాత దర్శకుడి ప్రశంస
హైదరాబాద్: బాహుబలి సిరీస్‌ను తెరకెక్కించి ఘన విజయం సాధించిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై ప్రశంసలు కురుస్తున్నాయి. వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో సినిమా తీసిన రాజమౌళి తెగువను కొనియాడుతున్నారు. ప్రఖ్యాత దర్శకుడు శేఖర్ కపూర్ కూడా ఈ జాబితాలో చేరారు. రాజమౌళిని ప్రశంసిస్తూ ట్వీట్ పెట్టారు. ‘సృజనాత్మక తెగువ ప్రదర్శించి, ఎన్నో కష్టాలను అధిగమించి బాహుబలి 2 సినిమా తీసిన రాజమౌళిని ఎంతో అభిమానిస్తున్నాన’ని ట్వీట్ చేశారు. దీనికి ఎంతో వినమ్రంగా రాజమౌళి సమాధానమిచ్చారు. ‘ఫెయిల్యూర్ గురించి భయపడుతూనే సృజనాత్మక ధైర్యంతో ముందడుగు వేస్తుంటాను. మీ శైలిలో సినిమాలు తీయాలన్నది నా కోరిక. కానీ మీలా సినిమాలు తీయలేనని నాకు తెలుసున’ని రాజమౌళి ట్వీట్ పెట్టారు. దీనిపై శేఖర్ కపూర్ స్పందిస్తూ... ‘అపజయం పట్ల భయం సృజనాత్మకతకు గొప్ప చోదకంగా పనిచేస్తుంది. భయాన్ని తెలివైన సృజనాత్మక ప్రక్రియగా మార్చడంలో రాజమౌళి పనితనం అద్భుతమ’ని పేర్కొన్నారు. మరోవైపు బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి 2’ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. బాలీవుడ్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన శేఖర్ కపూర్.. మిస్టర్ ఇండియా, మసూమ్, బండిట్ క్వీన్, క్వీన్ ఎలిజబెత్, ది గోల్డెన్ ఏజ్ సినిమాలు తీశారు. Why I admire @ssrajamouli ? He showed creative courage and grit to beat all odds #Bahubali2 — Shekhar Kapur (@shekharkapur) 8 May 2017 @shekharkapur Sir my creative courage is always interlaced with constant fear of failure. I So wish to be as rebellious as you, but also know that i cant — rajamouli ss (@ssrajamouli) 8 May 2017 @ssrajamouli Fear of failure is a great driver of creativity. You've managed to turn that fear into brilliant creative action. Wonderful @ssrajamouli — Shekhar Kapur (@shekharkapur) 8 May 2017 -
'మీ సినిమాపై నమ్మకముంటే పోరాడండి'
ముంబై: 'ఉడ్తా పంజాబ్' సెన్సార్ వివాదంపై ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ స్పందించారు. చివరి వరకు పోరాడాలని 'ఉడ్తా పంజాబ్' నిర్మాతలకు సూచించారు. తాను కూడా 'బండిట్ క్వీన్' సినిమా విషయంలో న్యాయపోరాటం చేశానని గుర్తు చేశారు. 'మీ సినిమా నిజంగా మీకు నమ్మకం ఉంటే చివరకు వరకు పోరాటం చేయండి. బండిట్ క్వీన్ సినిమా విడుదల సమయంలో సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేశాం' అని శేఖర్ కపూర్ ట్వీట్ చేశారు. 'ఉడ్తా పంజాబ్' సినిమా పేరు మార్చాలని సెన్సార్ బోర్డు కోరడం, చిత్రయూనిట్ తిరస్కరించడంతో వివాదం మొదలైంది. ఈ సినిమాకు బాలీవుడ్ తారలు, టెక్నిషియన్లు మద్దతు ప్రకటించారు. సోషల్ మీడియాలో తమ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. 'మేమంతా మీ వెంటే ఉన్నా'మంటూ హీరో అర్జున్ కపూర్ ట్వీట్ చేశాడు. If u truly believe in ur film then u must be willing to fight to the end. We did with Bandit Queen all the way to Supreme Court #UdtaPunjab — Shekhar Kapur (@shekharkapur) 9 June 2016 This one s for #UdtaPunjab s Tommy Singh urf @shahidkapoor !!! We all behind u n the film brother !!! pic.twitter.com/0Bpyu4428A — Arjun Kapoor (@arjunk26) 9 June 2016 -
85 ఏళ్ల వృద్ధురాలిగానూ!
గాసిప్ తెరపై అందాలను ఒలికిస్తూ, గ్లామరస్‌గా చేయాల్సిన సమయంలో లేటు వయసు పాత్రలు చేయాలంటే చాలా మంది కథానాయికలు ‘అయ్య బాబోయ్’ అంటారు. కానీ పాత్రానుగుణంగా తమను తాము మలుచుకోవడానికి ఎంతకైనా సిద్ధపడే హీరోయిన్లు అతి కొద్ది మందే. వాళ్లలో కంగనా రనౌత్ ఒకరు. ఛాలెంజింగ్ రోల్స్‌ను అవలీలగా చేయడంలో ఆమెకు ఆమే సాటి. ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగూన్’ చిత్రంలో చిత్రం కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారామె. తాజాగా మరో చిత్రంలో 85 ఏళ్ల వృద్ధురాలిగా నటించడానికి సుముఖత వ్యక్తం చేశారట. ‘మిస్టర్ ఇండియా’, ‘పానీ’, ‘బండిట్ క్వీన్’ లాంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన నటుడు శేఖర్ కపూర్ ఈ చిత్రానికి దర్శకుడు. దీని గురించి కంగన మాట్లాడుతూ-‘‘ కథ నచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉంది. అన్నీ కుదిరితే ఆ పాత్ర కచ్చితంగా చేస్తాను. ఇది వరకు వయసు మళ్లిన పాత్రలు చేయాలన్న ఆలోచన ఉండేది కాదు. కానీ ఇటీవలే ‘అమోర్’ అనే హాలీవుడ్ చిత్రం ఈ విషయంలో నా దృక్పథాన్ని మార్చింది. ముసలివాళ్ల చుట్టూ ఈ కథాంశం తిరుగుతుంది. నా హృదయాన్ని కదిలించిన సినిమా ఇది. ఆ ప్రేరణతోనే శేఖర్ సార్ ఈ పాత్ర గురించి చెప్పగానే ఓకే చెప్పాను’’ అని అన్నారు. -
వెండితెరకు ‘స్లమ్ గాడ్స్’ జీవితం!
దాదాపు ఐదేళ్ల క్రితం వచ్చిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రం గురించి అందరికీ తెలుసు. ఎ.ఆర్. రహమాన్‌కి ఆ సినిమా జంట ఆస్కార్ అవార్డులు తెచ్చిపెట్టిన విషయమూ తెలిసిందే. ముంబయ్‌కి చెందిన జుహూలోని మురికివాడకు సంబంధించిన ఓ యువకుడి కథతో ప్రధానంగా ఈ చిత్రం సాగుతుంది. కాగా, ఇప్పుడదే ముంబయ్ మహానగరంలో ప్రసిద్ధి పొందిన ధారావి అనే మురికి వాడ నేపథ్యంలో శేఖర్ కపూర్ ఓ చిత్రం రూపొందించనున్నారు. మట్టిలో మాణిక్యాలు ఉంటాయనే భావనతో ఈ మురికివాడలో ఉన్న పిల్లల్లోని ప్రతిభను వెలికి తీసేలా ఆకాశ్ దంగర్ అనే వ్యక్తి ‘స్లమ్ గాడ్స్’ అనే గ్రూప్‌ని ప్రారంభించారు. పిల్లలను చదివించడంతో పాటు, వారికి ఆసక్తి ఉన్న విషయాల్లో శిక్షణ ఇప్పించడం, యువతీ యువకుల్లో చైతన్యం నింపడం ఈ స్లమ్ గాడ్స్ ఉద్దేశం. ఈ గ్రూప్‌లో ఉన్న సభ్యుల్లో ‘హిప్ హాప్’ నేర్చుకుని, మంచి గుర్తింపు తెచ్చుకున్నవాళ్లు ఉన్నారు. స్లమ్ గాడ్స్ని ఆరంభించిన ఆకాశ్, హిప్ హాప్ ద్వారా ప్రసిద్ధి పొందిన ఆ సభ్యుల జీవితం ఆధారంగా సంగీత దర్శకుడు ఎ.ఆర్. రహమాన్‌తో కలిసి శేఖర్ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. మరో విశేషం ఏంటంటే.. స్లమ్ గాడ్స్‌లోని ధారావికి చెందినవారితోనే కథ రాయించడంతో పాటు, వాళ్లతోనే దర్శకత్వం వహింపజేయాలనుకుంటున్నారు. -
..నా బుక్ చెబుతుంది
చిట్‌చాట్ సుచిత్రా కృష్ణమూర్తి గాయని, నటి, రచయిత, చిత్రకారిణి... పేరుకు ముందు ఇలా ఒకటీ కాదు రెండు కాదు అరడజనుకు పైగానే చేర్చదగిన సెలబ్రిటీ సుచిత్రా కృష్ణమూర్తి. ప్రసిద్ధ దర్శకుడు శేఖర్‌కపూర్‌కు మాజీ భార్య అయిన సుచిత్ర... రన్, మై వైఫ్స్ మర్డర్ వంటి హిందీ చిత్రాల కోసం దర్శకుడు ‘రామ్‌గోపాల్ వర్మ’తో కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే వర్మను పెళ్లి చేసుకోవాలని తాను అనుకుంటున్నట్టు సుచిత్ర ఒక మెసేజ్ పంపారు. దీనికి వర్మ.. తనకు పెళ్లి అనే వ్యవస్థ మీద నమ్మకం లేదని బదులిచ్చారట. ఈ నేపథ్యంలో సుచిత్ర తన పుస్తకం ‘డ్రామా క్వీన్’ ద్వారా రాముతో తన పెళ్లి ప్రస్తావన సంబంధిత విషయాలను వెల్లడించి వార్తల్లో వ్యక్తిగా మారారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి నగరంలోని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో తను గీసిన చిత్రాలతో ‘పెట్రికార్’ చిత్రప్రదర్శన ఏర్పాటు చేయడంతో పాటు డ్రామాక్వీన్ పుస్తకాన్ని విడుదల చేశారు. పలువురు సినీ, సిటీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం సందర్భంగా ‘సిటీప్లస్’తో సుచిత్ర మాట్లాడుతూ వివిధ అంశాలపై స్పందించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... నగరంతో చిరకాల అనుబంధం.. హైదరాబాద్‌కు తరచూ వస్తుంటాను. ఇక్కడ నా సోదరుడితో పాటు ఫ్రెండ్స్ ఉన్నారు. 2009లో ఇక్కడ నా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశాను. ఆ తర్వాత మళ్లీ ఇదే నా సోలో ఎగ్జిబిషన్. జీవితాన్నే స్ఫూర్తిగా తీసుకుని నేను చిత్రాలు గీస్తున్నా. ఈ ప్రదర్శన ద్వారా వచ్చిన నిధులను టాలీవుడ్ నటి సమంత సిటీ కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రత్యూష సపోర్ట్ సంస్థకు విరాళంగా అందించనున్నాను. నో ప్లాన్స్.. ఓన్లీ యాక్షన్స్.. సింగర్, యాక్టర్, ఆర్టిస్ట్.. ఇలా నాలోని విభిన్న కోణాలను ప్రదర్శించడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదు. నాకు ఎప్పుడు ఏది ఆసక్తిగా అనిపిస్తే, చేయాలని అనిపిస్తే అది చేస్తూ వెళతాను. నచ్చనిది చేయను. ఏదైనా సరే ముందుగా అనుకుని ప్లాన్ చేసి చేయడం నాకు అలవాటు లేదు. అందుకే లక్ష్యాలంటూ ఏవీ లేవు. భవిష్యత్తులో పాప్ ఆల్బమ్ రిలీజ్ చేస్తారా అని అడిగినా నా జవాబు అదే. వర్మతో పెళ్లి ప్రస్తావన.. రామ్‌గోపాల్ వర్మ దగ్గర నా పెళ్లి ప్రస్తావన, తను తిరస్కరించడం.. వీటన్నింటి గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయంలో మీ సందేహాలకు సమాధానం ఒకటే. అది. నా పుస్తకం డ్రామా క్వీన్! ..:: ఎస్.సత్యబాబు -
‘జై భారతి. వందే భారతి’
ఇదొక నిరంతర పరిణామం స్వాతంత్య్ర దినోత్సవంపై బాలీవుడ్ న్యూఢిల్లీ: 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ అమితాబ్ సహా బాలీవుడ్ ప్రముఖులు జాతిజనులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్మాత శేఖర్‌కపూర్ మాట్లాడుతూ సంవత్సరంలో ఏదో ఒక్కరోజును కాకుండా కచ్చితంగా ప్రతిరోజునూ స్వాతంత్య్రదినోత్సవంగా పరిగణించాలన్నాడు. ‘ఇదొక సంఘటన కాదు. ఇదొక నిరంతర పరిణామం. ఒక దేశం ఎప్పటికీ స్వతంత్రం కాబోదు. అందులోని ప్రజలకు మాత్రమే స్వతంత్రం లభిస్తుంది’ అని అన్నాడు. నటి ప్రీతి జింతా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసింది. ‘స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు’అని అమితాబ్ ట్వీట్ చేశాడు. ‘జై భారతి. వందే భారతి’ అంటూ లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు. ‘స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు. జైహో’ అని నటదర్శకురాలు ఫర్హాన్‌ఖాన్ పేర్కొన్నారు. నిర్మాత మాధుర్ భండార్కర్ మాట్లాడుతూ దేశంలో శాంతిసౌభ్రాతృత్వాలు పరిఢవించాలంటూ అభిలషించారు. వందేమాతరం అని పేర్కొన్నారు. గాయని ఆశా భోస్లే ‘జైహింద్’ అంటూ ట్వీట్ చేశారు. నటి అనుష్కశర్మ దేశసేవలో తరిస్తున్న జవానులనుఅభినందించారు. సహభారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ద్వేషం, భయాలను వంటి వాటినుంచి ఇకనైనా స్వాతంత్రం పొందాలంటూ సంగీత దర్శకుడు విశాల్ డఢ్లాని దేశప్రజలకు సూచించారు. అదే నిజమైన స్వాతంత్య్రమంటూ అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ తమ మనసులను కూడా స్వేచ్ఛగా ఉంచుకోవాలన్నారు. ఇంకా సుజయ్‌ఘోష్, ఆనంద్‌రాయ్, దియామీర్జా, వీర్‌దాస్, షాహిద్‌కపూర్, సంగీత దర్శకుడు శేఖర్ రవిజైని తమ తమ అభిమానులకు 68వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. -
శేఖర్ కపూర్ పానీలో జెన్నిఫర్ లారెన్స్!
మన భారతీయ తారలు హాలీవుడ్ చిత్రాల్లో నటించడం కామన్ అయ్యింది. కానీ, హాలీవుడ్ తారలు మాత్రం ఇక్కడి చిత్రాల్లో నటించడం చాలా అరుదు. కథ, పాత్ర ఎంతో నచ్చితేనే ఇక్కడి చిత్రాలకు పచ్చజెండా ఊపుతారు. ఇటీవల హాలీవుడ్ తార జెన్నిఫర్ లారెన్స్ అదే చేశారని సమాచారం. శేఖర్ కపూర్ దర్శకత్వం వహించనున్న ‘పానీ’లో నటించడానికి ఆమె అంగీకరించారట. యశ్‌రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. భవిష్యత్తులో అంతర్జాతీయ సంస్థలు నీళ్లని తమ ఆధిక్యంలో ఉంచుకుంటే, ఇక్కడివాళ్లు ఆ నీళ్లను దక్కించుకోవడానికి ఏం చేస్తారు? అనేది ఈ చిత్రం ప్రధానాంశం అని బాలీవుడ్ టాక్. కథానుగుణంగా ఈ చిత్రంలో ఇక్కడి తారలతో పాటు హాలీవుడ్ తారలను ఎంపిక చేయాలనుకున్నారు శేఖర్. జెన్నిఫర్ లారెన్స్‌కి అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉండడంతో పాటు, ఈ చిత్రంలోని పాత్రకు ఆమె నప్పుతారు కాబట్టి, తీసుకోవాలనుకున్నారట. ఈ చిత్రకథ నచ్చి ఆమె వెంటనే అంగీకరించారని వినికిడి. దాదాపు 150 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని బాలీవుడ్ టాక్. అందుకే, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మంచి బిజినెస్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. జెన్నిఫర్ లారెన్స్‌ని తీసుకోవడానికి ఇదో కారణం అంటున్నారు. ఇందులో జెన్నిఫర్ సరసన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించనున్నారు. మే నెలలో ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించనున్నారు. -
సిక్కుల ఊచకోతకు కాంగ్రెస్ భాద్యత వహిస్తుందా?- శేఖర్ కపూర్
అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన సినీ దర్శకుడు శేఖర్ కపూర్ ఎక్కువగా వివాదాల్లో తలదర్చినట్టు కనిపించడు. అయితే తాజాగా ఓ వివాదస్పదమైన వ్యాఖ్య చేసి వార్తల్లో నిలివడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో వేలాది మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు అని ట్విటర్ లో పోస్ట్ చేశాడు. అయితే దారుణ సంఘటనకు కాంగ్రెస్ నాయకత్వం బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించాడు. ఎప్పుడో జరిగిన దారుణ సంఘటనను మళ్లీ కెలకడం వెనుక కారణం ఏమై ఉంటుందా అని సినీ, రాజకీయ విమర్శకులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తుండగా శేఖర్ కపూర్ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను కూడా సంతరించుకున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడిప్పుడే మానుతున్న పుండు గీకడం అంటే ఇదేనేమో అంటున్నారు కొందరు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు జరిపిన దాడుల్లో వేలాది మంది సిక్కులు దారుణ హత్యకు గురయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు హెచ్ కే భగత్, సజ్లన్ కుమార్ లపై కూడా కేసులు నమోదయ్యాయి. 1000's innocent Sikhs killed on streets of Delhi after Indira Gandhi assassination. Was the Congress leadership responsible? #pradhanmantri — Shekhar Kapur (@shekharkapur) October 19, 2013