శేఖర్ కపూర్ పానీలో జెన్నిఫర్ లారెన్స్! | Is Jennifer Lawrence part of Shekhar Kapur's 'Paani' cast? | Sakshi
Sakshi News home page

శేఖర్ కపూర్ పానీలో జెన్నిఫర్ లారెన్స్!

Jan 8 2014 11:56 PM | Updated on Apr 3 2019 6:23 PM

శేఖర్ కపూర్ పానీలో జెన్నిఫర్ లారెన్స్! - Sakshi

శేఖర్ కపూర్ పానీలో జెన్నిఫర్ లారెన్స్!

మన భారతీయ తారలు హాలీవుడ్ చిత్రాల్లో నటించడం కామన్ అయ్యింది. కానీ, హాలీవుడ్ తారలు మాత్రం ఇక్కడి చిత్రాల్లో నటించడం చాలా అరుదు. శేఖర్ కపూర్ పానీలో జెన్నిఫర్ లారెన్స్!

మన భారతీయ తారలు హాలీవుడ్ చిత్రాల్లో నటించడం కామన్ అయ్యింది. కానీ, హాలీవుడ్ తారలు మాత్రం ఇక్కడి చిత్రాల్లో నటించడం చాలా అరుదు. కథ, పాత్ర ఎంతో నచ్చితేనే ఇక్కడి చిత్రాలకు పచ్చజెండా ఊపుతారు. ఇటీవల హాలీవుడ్ తార జెన్నిఫర్ లారెన్స్ అదే చేశారని సమాచారం. శేఖర్ కపూర్ దర్శకత్వం వహించనున్న ‘పానీ’లో నటించడానికి ఆమె అంగీకరించారట. యశ్‌రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. భవిష్యత్తులో అంతర్జాతీయ సంస్థలు నీళ్లని తమ ఆధిక్యంలో ఉంచుకుంటే, ఇక్కడివాళ్లు ఆ నీళ్లను దక్కించుకోవడానికి ఏం చేస్తారు? అనేది ఈ చిత్రం ప్రధానాంశం అని బాలీవుడ్ టాక్.
 
  కథానుగుణంగా ఈ చిత్రంలో ఇక్కడి తారలతో పాటు హాలీవుడ్ తారలను ఎంపిక చేయాలనుకున్నారు శేఖర్. జెన్నిఫర్ లారెన్స్‌కి అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉండడంతో పాటు, ఈ చిత్రంలోని పాత్రకు ఆమె నప్పుతారు కాబట్టి, తీసుకోవాలనుకున్నారట. ఈ చిత్రకథ నచ్చి ఆమె వెంటనే అంగీకరించారని వినికిడి. దాదాపు 150 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని బాలీవుడ్ టాక్. అందుకే, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మంచి బిజినెస్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. జెన్నిఫర్ లారెన్స్‌ని తీసుకోవడానికి ఇదో కారణం అంటున్నారు. ఇందులో జెన్నిఫర్ సరసన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించనున్నారు. మే నెలలో ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement