breaking news
Paani
-
సంచలనం రేపిన లొంగుబాటు!
తాత్కాలిక సాయుధ పోరాట విరమణ పేరుతో ఇద్దరు మావోయిస్టు నేతలు ప్రభుత్వానికి ఆయుధాలు అప్పగించి లొంగిపోవడం సంచలనం రేపింది. విప్లవకారులు గతంలో ఎందరో లొంగిపోయారు. కానీ, వీళ్లు లొంగిపోయిన తీరు అనేక ప్రశ్నలను లేవదీసింది. సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహావేశాలు వెల్లడవుతున్నాయి. దీనికి ప్రతిగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోవాలనుకోవడం తప్పా? జీవిత పర్యంతం విప్లవం చేయాలని నిర్దేశించడానికి మీరెవరు? విప్లవకారులు కలలో కూడా ఆయుధం వదలకూడదనే హక్కు ఉన్నదా? అనే నైతిక ప్రశ్నలు సంధిస్తున్నారు.విప్లవ సిద్ధాంతాన్ని ఎదుర్కోలేకే...విప్లవంలో అలసిపోయో, ఆనారోగ్యంతోనో, ఇష్టం తగ్గిపోయో ఇంటికి వచ్చిన వాళ్లను ఎవరేమంటారు? అంటే తప్పు. కానీ ఈ నాయకులు అంత సాధారణంగా ఉద్యమం నుంచి బయటికి రాలేదని గడ్చిరోలిలో, జగ్దల్పూర్లో జరిగిన లొంగుబాటు సన్నివేశాలు చూసిన వాళ్లెవరైనా గ్రహించగలరు. విప్లవోద్యమం వెనుకపడ్డానికి మావోయిస్టు పంథాయే కారణమని, తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేసి బయటికి రావాలని అనుకున్నట్లు వాళ్ల ప్రకటనలను బట్టి తెలుస్తోంది. విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికే ఈ పని చేస్తున్నామని కూడా అన్నారు. ఇంతకుమించి ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యలకు ఎట్లాంటి ప్రత్యామ్నాయమూ ప్రతిపాదించలేదు. వాళ్లు లొంగిపోయిన తీరు దాన్ని బలపరిచింది. ‘తాత్కాలికం’ పేరుతో శాశ్వతంగా ఆయుధాలు వదిలేయడం తప్ప, ఇంకో ఆలోచన ఏదీ లేదని స్పష్టమైపోయింది. వాళ్లు మావోయిస్టు పంథాను వ్యతిరేకించి బయటికి వచ్చారని అనుకున్న విప్లవోద్యమ విమర్శకులను నిరాశకు గురిచేశారు. ‘సాయుధ పోరాట విర మణ’ ప్రభుత్వ ప్రాయోజితమని తేటతెల్లమై పోయింది. ఆ సన్నివేశాల్లో కలిసిన ఇరుపక్షాలే దాన్ని నిరూపించుకున్నాయి.ఈ విషాదకర పరిణామాలు ‘ఆపరేషన్ కగార్’ (operation kagar) అనే అంతర్యుద్ధం మధ్యలో జరిగాయి. ఎందుకిలా జరిగింది? అనేది ప్రత్యేక చర్చనీయాంశం. ఈ కగార్ మారణకాండ ఆగాలని మార్చి నెల చివరిలో మావోయిస్టులు కాల్పుల విరమణను ప్రతిపాదించారు. శాంతి చర్చల కోసం దేశ వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. ప్రభుత్వం పట్టించుకోకపోగా గడువులోపే మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తానని అన్నది గాని, అది అంత తేలిక కాదని అర్థమైంది. తుపాకులను, తలకాయలను లెక్కించుకుంటూ రాజ్యం సరిపెట్టుకోదు. లక్షల సైనిక బలగాలతో, ఆధునాతన సాంకేతికతతో మనుషులను చంపుతున్నంత సులభంగా విప్లవ సిద్ధాంతాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు. బయటి యుద్ధానికి లోపలి యుద్ధం తోడు కావాలి. మావోయిస్టు పంథా పూర్తి తప్పనీ, మారుతున్న ప్రపంచం గురించి ఆ ఉద్యమానికి ఏమీ తెలియదనీ, కేవలం సైనిక చర్యలుగా మిగిలిపోయిందనీ, కాబట్టి ఆయుధాలు వదిలేయాలనే వాదన లోపలినుంచే రావాలి. తద్వారా మావోయిస్టు పంథా తన సంబద్ధతను కోల్పోయేలా చేయాలి. రాజ్యం జాగ్రత్తగా ఆ పని చక్కపెట్టింది. కగార్ యుద్ధానికి కొనసాగింపే సాయుధ పోరాట విరమణ అనే వాదనతో కగార్ వ్యతిరేక ప్రజాస్వామిక ఆందోళన కూడా పక్కకు పోయింది.ఆదివాసుల అస్తిత్వం ఏమైపోతుంది?ఈ మొత్తం వల్ల సరికొత్త చర్చ ఆరంభమైంది. కగార్‌ను విస్మరించి మావోయిస్టు పంథా తప్పని చెప్పడానికి చాలా మంది ఉత్సాహపడ్డారు. రాజ్య దుర్మార్గాన్ని మాట్లాడటం మర్చిపోయారు. మావోయిస్టుల సాయుధ పోరాటం ఆగిపోతే, అక్కడ ఉండే ఆదివాసుల పరిస్థితి ఏమిటి? దానికి రాజ్యం ఏమైనా హామీ పడుతుందా? ఈ పరిణామాల్లో ప్రజలను కేంద్రంగా చేసుకోవాల్సి ఉన్నది. ఆయుధాల అప్పగింత మీద ఒకింత ఆగ్రహంగా మాట్లాడినవాళ్లను ఉద్దేశించి ‘అయితే మీరు వెళ్లి ఆయుధాలు పట్టుకోండి మరి’ అన్నారేగానీ, కార్పొరేట్ల కోసం చుట్టుముట్టిన లక్షల సైనిక బలగాల మధ్య ఆదివాసుల అస్తిత్వం ఏమైపోతుంది? అని ప్రశ్నించుకోలేదు. విప్లవోద్యమానికి ఆయుధాలు సెంటిమెంట్ కాదు. దీర్ఘకాలిక ప్రజాయుద్ధమంటే రాజకీయార్థిక సాంస్కృతిక సైనిక విధానం. ఆయుధాలు కేంద్రంగా మావోయిస్టు ఉద్యమాన్ని చూసేవాళ్లకు ఇది తెలియదు. విప్లవాన్ని ప్రజల వైపు నుంచి చూడాలి. సమకాలీన సామాజిక పరిణామాలు, నానాటికీ బలపడుతున్న రాజ్యం, ప్రజల దుర్భరస్థితి సాయుధ పోరాట అవసరాన్ని పెంచుతున్నాయి. ప్రజాస్వామిక పోరాటాలకు కనీస అవకాశం లేని, ఏ పోరాటమూ కొద్ది కాలం కూడా స్థిమితంగా కొనసాగలేని పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధ పోరాటాల, సాయుధ పోరాటాల మేళవింపుతోనే ఈ స్థితిని అధిగమించడం, ప్రజల్ని సమీకరించడం సాధ్యం. నిరంతర ఆత్మవిమర్శతో ఉద్యమాలు తప్పొప్పులను పరీక్షించుకోవాలి.చదవండి: రాజ్యాంగం వర్సెస్ రైఫిల్ఈ వైపు నుంచి చూస్తే కొత్త చారిత్రక ప్రపంచంలో విప్లవం చేస్తున్నామనే ఎరుక ఉన్నదని మావోయిస్టులు తమ ఆచరణతో ఇప్పటికే రుజువు చేసుకున్నారు. గత ఇరవై ఏళ్ల ప్రపంచ విప్లవోద్యమాల్లో మావోయిస్టు పంథా కొన్ని విజయాలు సాధించింది. అయినా వాళ్ల ముందు అనేక ఆచరణాత్మక సవాళ్లు ఉన్నాయి. రాజ్య నిర్బంధం వల్ల ఇటీవల కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యారు. ఈ లొంగుబాట్లతో మరింత కుంగిపోవచ్చు. కొందరు దీనికంతా విప్లవోద్యమ పంథా కారణం అంటున్నారు. మావోయిస్టు పంథా ఆరంభమైనప్పుడే ఓడిపోయిందని అంటున్నారు. ఈ చమత్కారాన్ని వాస్తవ చరిత్ర అంగీకరించదు! - పాణి ‘విరసం’ సభ్యులు -
Fathers Day 2024: తండ్రి కళ్లలో కోటి వెలుగులు తెచ్చింది
ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన మాన్సీ జైన్‌కు రాజేష్ జైన్ తండ్రి మాత్రమే కాదు ఆప్త మిత్రుడు. దారి చూపే గురువు. తన తండ్రితో కలిసి గురుగ్రామ్ కేంద్రంగా ‘డిజిటల్ పానీ’ అనే స్టార్టప్‌ను మొదలుపెట్టింది. పరిశ్రమలు, నివాస ్రపాంతాలలో మురుగు జలాలను తక్కువ ఖర్చుతో శుద్ధి చేయడానికి ఉపకరించే కంపెనీ ఇది. తండ్రి మార్గదర్శకత్వంలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించిన మాన్సీ జైన్ గురించి...స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్న తరువాత ఇండియాకు తిరిగి వచ్చిన మాన్సీ జైన్‌లో స్టార్టప్ కలలు మొదలయ్యాయి. తన ఆలోచనలను తండ్రి రాజేష్‌తో పంచుకుంది.‘నువ్వు సాధించగలవు. అందులో సందేహమే లేదు’ కొండంత ధైర్యం ఇచ్చాడు తండ్రి.మాన్సీ తండ్రి రాజేష్ జైన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దిల్లీలో కెమికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశాడు. వాటర్ అండ్ ఎనర్జీ ఇండస్ట్రీలో ఇంజినీర్‌గా పాతిక సంవత్సరాలు పనిచేశాడు.వేస్ట్‌వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ విషయంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. తండ్రి నుంచి చందమామ కథలు విన్నదో లేదు తెలియదుగానీ నీటికి సంబం«ధించిన ఎన్నో విలువైన విషయాలను కథలు కథలుగా విన్నది మాన్సీ. పర్యావరణ అంశాలపై ఆసక్తి పెంచుకోవడానికి, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ చదవడానికి తాను విన్న విషయాలు కారణం అయ్యాయి.‘మన దేశంలో తొంభైవేల మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. 95 శాతం పని మాన్యువల్‌గానే జరుగుతోంది. ప్రతి ప్లాంట్‌లో ఆపరేటర్లను నియమించారు. లోపాలను ఆలస్యంగా గుర్తించడం ఒక కోణం అయితే చాలామంది ఆపరేటర్లకు సమస్యలను పరిష్కరించే నైపుణ్యం లేకపోవడం మరో అంశం. ఈ నేపథ్యంలోనే సరిౖయెన పరిష్కార మార్గాల గురించి ఆలోచన మొదలైంది’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది మాన్సీ.మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల గురించి తండ్రితో ఎన్నో రోజుల పాటు చర్చించింది మాన్సీ. ఆ మేథోమధనంలో నుంచి పుట్టిందే... ‘డిజిటల్ పానీ’ స్టార్టప్.నివాస ్రపాంతాలు, పరిశ్రమలలో నీటి వృథాను ఆరికట్టేలా, తక్కువ ఖర్చుతో మురుగునీటిని శుద్ధి చేసేలా ‘డిజిటల్ పానీ’కి రూపకల్పన చేశారు.ఎక్విప్మెంట్ ఆటోమేషన్, వాట్సాప్ అప్డేట్స్, 24/7 మేనేజ్మెంట్.., మొదలైన వాటితో వాటర్ మేనేజ్మెంట్ ΄్లాట్ఫామ్గా ‘డిజిటల్ పానీ’ మంచి గుర్తింపు తెచ్చుకుంది.‘నీటి మౌలిక సదుపాయాలకు సంబంధించి మా ΄్లాట్ఫామ్ని వైద్యుడిగా భావించాలి. ఎక్కడ సమస్య ఉందో గుర్తించి దాని నివారణకు తగిన మందును ఇస్తుంది. సాంకేతిక నిపుణులకు దిశానిర్దేశం చేస్తుంది. ఎన్నో రకాలుగా క్లయింట్స్ డబ్బు ఆదా చేయగలుగుతుంది’ అంటుంది మాన్సీ.టాటా పవర్, దిల్లీ జల్ బోర్డ్, లీలా హాస్పిటల్స్‌తో సహా 40 పెద్ద పరిశ్రమలు ‘డిజిటల్ పానీ’ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. ‘డిజిటల్ పానీ’ ప్రస్తుతం పద్నాలుగు రాష్ట్రాలలో పనిచేస్తోంది. ‘ఎకో రివర్’ క్యాపిటల్‌లాంటి గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీకి అవసరమైన నిధులను సేకరించారు.‘వాళ్ల సమర్ధమైన పనితీరుకు ఈ ΄్లాట్‌ఫామ్ అద్దం పడుతుంది’ అంటున్నారు ‘డిజిటల్ పానీ’లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకున్న ‘ఏంజియా వెంచర్స్’కు చెందిన కరుణ జైన్, శివమ్ జిందాల్.‘డిజిటల్ పానీ’కి ముందు కాలంలో... ఎన్నో స్టార్టప్‌ల అపురూప విజయాల గురించి ఆసక్తిగా చర్చించుకునేవారు తండ్రీ, కూతుళ్లు. ఆ స్టార్టప్‌ల విజయాల గురించి లోతుగా విశ్లేషించేవారు. ఈ విశ్లేషణ ఊరకే పోలేదు. తమ స్టార్టప్ ఘన విజయం సాధించడానికి అవసరమైన పునాదిని ఏర్పాటు చేసుకోవడానికి కారణం అయింది.‘షార్క్ ట్యాంక్ ఇండియా’ టీవీ పోగ్రామ్‌లో తండ్రి రాజేష్‌తో కలిసి పాల్గొంది మాన్సీ. తాగునీటి సమస్య, నీటి కాలుష్యం... మొదలైన వాటి గురించి సాధికారికంగా మాట్లాడింది. జడ్జ్‌లు అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు తడుముకోకుండా జవాబు చెప్పింది.‘మీరు చాలా తెలివైనవారు’ అని జడ్జి ప్రశంసించేలా మాట్లాడింది. ఆసమయంలో తండ్రి రాజేష్ జైన్ కళ్లలో ఆనంద వెలుగులు కనిపించాయి. కుమార్తెతో కలిసి సాధించిన విజయం తాలూకు సంతృప్తి ఆయన కళ్లలో మెరిసింది. నాన్న హృదయం ఆనందమయంపిల్లలు విజయం సాధిస్తే ఎంత సంతోషం కలుగుతుందో, వారితో కలిసి విజయం సాధిస్తే అంతకంటే ఎక్కువ సంతోషం కలుగుతుంది. మాన్సీ తండ్రిగా ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే ఉన్నాడు రాజేష్ జైన్. స్టార్టప్ పనితీరు గురించి పక్కా ప్రణాళిక రూ΄÷ందించడం నుంచి అది పట్టాలెక్కి మంచి పేరు తెచ్చుకోవడం వరకు కూతురికి అండగా నిలబడ్డాడు. దిశానిర్దేశం చేశాడు. బిజినెస్ రియాలిటీ టెలివిజన్ సిరీస్ ‘షార్క్ ట్యాంక్’లో కుమార్తె మాన్సీతో కలిసి పాల్గొన్న రాజేష్ జైన్‌లో సాంకేతిక నిపుణుడు, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కంటే చల్లని మనసు ఉన్న తండ్రి కనిపించాడు. కుమార్తెతో కలిసి సాధించిన విజయానికి ఉ΄÷్పంగి పోతున్న తండ్రి కనిపించాడు. -
శేఖర్ కపూర్ పానీలో జెన్నిఫర్ లారెన్స్!
మన భారతీయ తారలు హాలీవుడ్ చిత్రాల్లో నటించడం కామన్ అయ్యింది. కానీ, హాలీవుడ్ తారలు మాత్రం ఇక్కడి చిత్రాల్లో నటించడం చాలా అరుదు. కథ, పాత్ర ఎంతో నచ్చితేనే ఇక్కడి చిత్రాలకు పచ్చజెండా ఊపుతారు. ఇటీవల హాలీవుడ్ తార జెన్నిఫర్ లారెన్స్ అదే చేశారని సమాచారం. శేఖర్ కపూర్ దర్శకత్వం వహించనున్న ‘పానీ’లో నటించడానికి ఆమె అంగీకరించారట. యశ్‌రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. భవిష్యత్తులో అంతర్జాతీయ సంస్థలు నీళ్లని తమ ఆధిక్యంలో ఉంచుకుంటే, ఇక్కడివాళ్లు ఆ నీళ్లను దక్కించుకోవడానికి ఏం చేస్తారు? అనేది ఈ చిత్రం ప్రధానాంశం అని బాలీవుడ్ టాక్. కథానుగుణంగా ఈ చిత్రంలో ఇక్కడి తారలతో పాటు హాలీవుడ్ తారలను ఎంపిక చేయాలనుకున్నారు శేఖర్. జెన్నిఫర్ లారెన్స్‌కి అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉండడంతో పాటు, ఈ చిత్రంలోని పాత్రకు ఆమె నప్పుతారు కాబట్టి, తీసుకోవాలనుకున్నారట. ఈ చిత్రకథ నచ్చి ఆమె వెంటనే అంగీకరించారని వినికిడి. దాదాపు 150 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని బాలీవుడ్ టాక్. అందుకే, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మంచి బిజినెస్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. జెన్నిఫర్ లారెన్స్‌ని తీసుకోవడానికి ఇదో కారణం అంటున్నారు. ఇందులో జెన్నిఫర్ సరసన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించనున్నారు. మే నెలలో ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించనున్నారు.


