'మీ సినిమాపై నమ్మకముంటే పోరాడండి' | Fight till the end: Shekhar Kapur to Udta Punjab makers | Sakshi
Sakshi News home page

'మీ సినిమాపై నమ్మకముంటే పోరాడండి'

Jun 10 2016 4:57 PM | Updated on Sep 4 2017 2:10 AM

'మీ సినిమాపై నమ్మకముంటే పోరాడండి'

'మీ సినిమాపై నమ్మకముంటే పోరాడండి'

'ఉడ్తా పంజాబ్' సెన్సార్ వివాదంపై ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ స్పందించారు.

ముంబై: 'ఉడ్తా పంజాబ్' సెన్సార్ వివాదంపై ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ స్పందించారు. చివరి వరకు పోరాడాలని 'ఉడ్తా పంజాబ్' నిర్మాతలకు సూచించారు. తాను కూడా 'బండిట్ క్వీన్' సినిమా విషయంలో న్యాయపోరాటం చేశానని గుర్తు చేశారు. 'మీ సినిమా నిజంగా మీకు నమ్మకం ఉంటే చివరకు వరకు పోరాటం చేయండి. బండిట్ క్వీన్ సినిమా విడుదల సమయంలో సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేశాం' అని శేఖర్ కపూర్ ట్వీట్ చేశారు.

'ఉడ్తా పంజాబ్' సినిమా పేరు మార్చాలని సెన్సార్ బోర్డు కోరడం, చిత్రయూనిట్ తిరస్కరించడంతో వివాదం మొదలైంది. ఈ సినిమాకు బాలీవుడ్ తారలు, టెక్నిషియన్లు మద్దతు ప్రకటించారు. సోషల్ మీడియాలో తమ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. 'మేమంతా మీ వెంటే ఉన్నా'మంటూ హీరో అర్జున్ కపూర్ ట్వీట్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement