
బాలీవుడ్ భామ మలైకా అరోరా ఇటీవలే థామా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రంలో పాయిజన్ బేబీ పాట అనే ఐటమ్ సాంగ్‌తో అలరించింది. అంతేకాకుండా ఆమె ఇండియాస్ గాట్ టాలెంట్ అనే రియాలిటీ సిరీస్‌లో జడ్జిగా వ్యవహరిస్తోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ. ఈ బాలీవుడ్ బ్యూటీ ఇవాళ 53వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పలువురు సినీతారలు మలైకాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మలైకా పుట్టినరోజున ఆమె మాజీ ప్రియుడు అర్జున్ కపూర్ సైతం బర్త్ డే విషెస్ చెప్పారు. ఆమె ఫోటోను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్‌డే మలైకా.. మీరు ఎప్పుడు ఇలాగే ఎగురుతూ.. నవ్వుతూ ఉండాలి.. అంటూ పోస్ట్ చేశాడు. ఇది చూసిన మలైకా తన మాజీ ప్రియుడి పోస్ట్‌కు రిప్లై కూడా ఇచ్చింది. ధన్యవాదాలు అంటూ లవ్ సింబల్ ఎమోజీని జతచేసింది. కాగా.. ఈ ఏడాది జూన్‌లో అర్జున్ కపూర్ పుట్టినరోజున.. మలైకా సోషల్ మీడియా ద్వారా అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపింది.
అర్జున్ కపూర్‌తో డేటింగ్..
మలైకా అరోరా- అర్జున్ కపూర్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. దాదాపు ఆరేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరు గతేడాది విడిపోయినట్లు తెలిసింది. దీపావళి సందర్భంగా ఓ ఈవెంట్‌లో మాట్లాడిన అర్జున్ కపూర్.. తాను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానంటూ మలైకాతో బ్రేకప్‌పై క్లారిటీ ఇచ్చాడు. అయితే గతేడాది సెప్టెంబర్‌లో ఆమె తండ్రి అనిల్ మెహతా మరణించిన తర్వాత అర్జున్ కపూర్ ఆమెను ఇంటికెళ్లి పరామర్శించాడు. ఇటీవలే వీరిద్దరు ముంబయిలో జరిగిన హోమ్‌బౌండ్ ప్రీమియర్ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒకరినొకరు హృదయపూర్వకంగా చిరునవ్వుతో పలకరించుకున్నారు.
అర్బాజ్ ఖాన్‌తో పెళ్లి- విడాకులు..
కాగా.. మలైకా అరోరా గతంలో అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. 1998లో వివాహం చేసుకున్న ఈ జంటకు అర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు. వీరిద్దరు 2016లో విడిపోతున్నట్లు ప్రకటించి.. 2017లో విడాకులు తీసుకున్నారు.