టాలీవుడ్ హీరో శర్వానంద్ బైకర్ తర్వాత నటిస్తోన్న తాజా చిత్రం భోగి. ఈ మూవీకి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఎగిరి వరంగలేసి అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా..నల్గొండ గద్దర్ నర్సన్న, కందుకూరి శంకర్‌బాబు, రేలారే గోపాల్ ఆలపించారు. ఈ సాంగ్ భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు.
కాగా.. ఈ చిత్రాన్ని 1960ల నాటి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్య కథతో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా నవంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది.


