ప్రేమకు అడ్డుగా ఉన్నాడని తమ్ముడిని చంపించిన హీరోయిన్‌!

Shanaya Katwe Arrested In Her Brother Assassination Case - Sakshi

బెంగళూరు: ప్రేమ మైకంలో ఓ హీరోయిన్‌ సొంత తమ్ముడినే చంపుకుంది. తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని అతడిని శాశ్వతంగా అడ్డు తొలగించింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఇదం ప్రేమమ్‌ జీవనమ్‌, ఒందు గంటేయ కథ(ఒక గంట కథ) సినిమాల్లో నటించిన శనయా కాట్వే, సెలబ్రిటీ మేనేజర్‌గా పని చేస్తున్న నియాజ్‌ అహ్మద్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది. వీరిద్దరూ తరచూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారట. వీళ్ల వ్యవహారం నచ్చని శనయా సోదరుడు రాకేష్‌ ఆమెను హెచ్చరించాడు. అతడికి దూరంగా ఉండమని పదే పదే నచ్చజెప్పాడు. దీంతో ఇతడు తమ ప్రేమకు అడ్డొచ్చేలా ఉన్నాడని శనయా, ఆమె ప్రియుడు నియాజ్‌ ఆందోళన చెందారు. అతడిని అడ్డు తొలగించాలని స్కెచ్‌ వేశారు.

అనుకున్నట్లుగానే నియాజ్‌ అహ్మద్‌, అతడి అనుచరులు రాకేష్‌ను దారుణంగా చంపేసి, శవాన్ని కారులో దాచిపెట్టారు. కానీ ఆ కారులో నుంచి దుర్వాసన వస్తే పోలీసులకు దొరికిపోతామని భయపడిపోయారు. దీంతో రాకేష్‌ శవాన్ని తల, మొండెం, కాళ్లు, చేతులను ముక్కలు ముక్కలుగా కోసి హుబ్బళిలోని తదితర ప్రాంతాల్లో విసిరేశారు. కానీ రాకేష్‌ కేసును చాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడు నియాజ్‌ అని ఇట్టే గుర్తించారు. అతడిని అరెస్ట్‌ చేసి విచారణ చేపడుతున్నారు. ఈ హత్య కేసులో హీరోయిన్‌కు కూడా సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఆమెను కూడా అరెస్ట్‌ చేయడం సంచలనం రేపుతోంది.

చదవండి: పులి పిల్లలతో ఆడుకుంటున్న మెగా హీరో.. ఫోటో వైరల్

క్వారంటైన్‌లో మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top