బిగ్‌ బాస్‌: జోవికా తండ్రి ఎవరంటూ కామెంట్లు.. ఫైర్‌ అయిన షకీలా | Sakshi
Sakshi News home page

బిగ్‌ బాస్‌: జోవికా తండ్రి ఎవరు.. వారిని చీల్చిచెండాడిన షకీలా

Published Tue, Nov 7 2023 1:24 PM

Shakeela Slams To Who Asked Bigg Boss Jovika's Father - Sakshi

కోలీవుడ్‌లో జోవికా విజయ్ కుమార్ పేరు గత కొద్దరోజులుగా భారీగా ట్రెండింగ్‌లో ఉంది. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ కుమార్తెనే ఈ జోవిక. కోలీవుడ్‌లో ప్రసారం అవుతున్న బిగ్‌ బాస్‌ సీజన్‌ 7లో ఆమె ఎంట్రీ ఇచ్చింది. దీంతో షో పట్ల భారీగా అంచనాలు పెరిగాయి. జోవిక బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టగానే అందరూ స్టార్ కిడ్, బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టి తీసుకున్నారు అనుకున్నారు కానీ ఆమె ఆడుతున్న విధానం చూసి చాలామంది ముచ్చట పడుతున్నారు.18 ఏళ్ళ వయసులో ఆమె బ్యాలెన్స్, మెచ్యూరిటీ లెవెల్స్ మామూలుగా లేవని మెచ్చుకుంటున్నారు. ప్రతి మాటలో ఫైర్‌ ఉంటుంది. మాటల్లో తడబాటు ఉండదు. చెప్పాల్సిన విషయాన్ని పర్‌ఫెక్ట్‌గా చెబుతుంది. ఇలా తన గేమ్‌ ప్లాన్‌తో ఆమె దూసుకుపోతుంది.

జోవికా కోసం షకీలా ఫైట్‌
ఇలాంటి సమయంలో ఆమె తండ్రి ఎవరు..? సోషల్‌ మీడియాలో పలువురు కామెంట్లు చేయడం ప్రారంభించారు. దీంతో జోవికా వ్యక్తిగత జీవితం గురించి బిగ్ బాస్ ప్రేక్షకులలో పెద్ద చర్చనీయాంశమైంది. జోవిక వనిత మొదటి భర్త ఆకాష్‌కి పుట్టిన కూతురు. అయితే గతంలో వనిత రెండో భర్త చేసిన వాదన తాజాగా మరోసారి చర్చనీయాంశమైంది. జోవికా తండ్రి ఆకాష్ కాదని, ప్రేమికుడని చెప్పాడు. ప్రస్తుతం జోవికా బిగ్‌ బాస్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది ఇది నచ్చన కొందరు పీఆర్‌ టీమ్‌ వారు ఇలాంటి విషయాలను మళ్లీ తెరపైకి తెస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో నటి షకీలా స్పందించి తెరపైకి వచ్చింది. అలాంటి చెత్త కామెంట్లు చేసే వారిపై ఫైర్‌ అయింది. జోవికా తండ్రి ఆకాష్‌ అని షకీలా బలంగా చెప్పింది. అనుమానాలు లేవనెత్తే వారిని పరుషమైన భాషలో షకీల తిప్పికొట్టింది. అడిగేవారికి వేరే పని లేదు. ఇతరుల బెడ్‌రూమ్‌లలోకి వచ్చి చూస్తున్నారా..? అంటూ విరుచుకుపడింది.

జోవికా తండ్రి ఎవరో నాకు తెలుసు: షకీలా
'జోవికా తండ్రి ఎవరో నాకు తెలుసు. జోవికాకు ఒక సోదరితో పాటు ఒక సోదరుడు ఉన్నారు. జోవికా పుట్టిన సమయం నుంచి నాకు తెలుసు. ఇదంతా చూస్తుంటే ఎంత బాధగా ఉంటుంది. ఇలాంటి తప్పుడు మాటలు అంటే ఎదుటి వారు భాద పడుతారని కూడా ఎలా కామెంట్లు చేస్తారు..? ఏమీ ఆలోచించకుండా ఇతరుల బెడ్‌రూమ్‌లలోకి చొరబడే వారి కోసమే నేనొకటి అడుగుతున్నా.. ఇంతకూ నీ తండ్రి ఎవరు..? ఒకసారి సమాధానం చెప్పండి. పిల్లల తండ్రి ఎవరో తల్లికి మాత్రమే తెలుసు. ఆమె తండ్రి ఆకాష్. జోవిక పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. ఆమె పేరు పెట్టే రోజు నేను అక్కడ ఉన్నాను.

18 ఏళ్లు నిండిన పిల్లపై ఇలాంటి మాటలా..? ఆ చిన్నారిని ఎవరూ బాధపెట్టకూడదు. గతంలోనే జోవికా తల్లి చెప్పింది.. ఆ పాపకు తండ్రి ఆకాష్ అని. అంతకంటే ఇంకేం కావాలి..? జోవికాకు పెళ్లి చేయాలి, నాన్న ఎవరో కూడా తెలియదని ఆమెపై నిందలు వేస్తే ఎలా..? అలాంటి వారు నా ముందుకు వస్తే కచ్చితంగా కొడతాను.' అని షకీలా హెచ్చరించింది. చిన్న వయసులోనే చదువు మానేసినా జోవికా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుందని షకీలా కూడా చెబుతోంది. షకీలా తన జీవితంలోని అనేక దశలలో వనితతో ఓదార్పుగా ఉండేది. వారిద్దరూ 20 ఎళ్లకు పైగా మంచి స్నేహితులు.

Advertisement
 
Advertisement