లవ్‌ యూ బేబీ’ కొత్త ట్రెండ్‌ సెట్‌ చేస్తుంది 

Santhosh Prathap Love you baby Album Song To Release On 20th May - Sakshi

తమిళసినిమా: లవ్‌ యూ బేబీ వీడియో ఆల్బమ్‌ కొత్త ట్రెండ్‌ సెట్‌ చేస్తుందని  దర్శకుడు ప్రసాద్‌ రామన్‌ ధీమా వ్యక్తం చేశారు. నటుడు సంతోష్‌ ప్రతాప్, నటి ఐరా జంటగా నటించిన ఈ ఆల్బమ్‌ను అనుగ్రహ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఎస్‌.కామాక్షి కనిమొళి రూపొందించారు. ముత్తమిళం, ప్రసాద్‌ రామన్‌ కలిసి రాసిన ఈ పాట కు రాకేష్‌ అంబికాపతి సంగీతాన్ని అందించారు.

(చదవండి: ఓటీటీలోకి సిద్ధార్థ్‌.. స్ట్రీమింగ్‌ ఆ రోజు నుంచే..)

నటుడు సంగీత దర్శకుడు ప్రేమ్‌జీ అమరన్‌ పాడిన ఈ పాటకు సంతోష్‌ పాండే ఛాయాగ్రహణంను, రిచర్డ్‌ క్రిస్టఫర్‌ నృత్య దర్శకాన్ని సమకూర్చారు. ఈ తరం యువత నాడిని గ్రహించి వారిని అలరించే విధంగా ఈ వీడియో ఆల్బమ్‌ను రూపొందించినట్లు దర్శకుడు ప్రసాద్‌ రామన్‌ తెలిపారు. దీనిని 20వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top