Santhanam Upcoming Movie Is DD Returns - Sakshi
Sakshi News home page

Santhanam: నిరాశపరిచిన గత చిత్రాలు.. కామెడీతో సక్సెస్‌ కొడతానన్న సంతానం

Jul 23 2023 9:40 AM | Updated on Jul 23 2023 3:13 PM

Santhanam Upcoming Movie is DD Returns - Sakshi

నటుడు సంతానం ఇంతకు ముందు హర్రర్‌ డార్క్‌ కామెడీ నేపథ్యంలో రూపొందిన దిల్లుక్కు దుడ్డు, డీడీ–2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే ఆ తరువాత కామెడీకి భిన్నంగా నటించిన కొన్ని చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. దీంతో సంతానం మళ్లీ తనకు కలిసివచ్చిన కామెడీతోనే చేసిన చిత్రం డీడీ రిటర్న్స్‌. ఆర్‌కే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రమేష్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రంలో సురభి హీరోయిన్‌గా నటించారు.

నటుడు మారన్‌, సేతు, మొటై రాజేంద్రన్‌, ఫెప్సీ విజయన్‌, మునీష్‌ కాంత్‌, ప్రదీప్‌ రావత్‌, రెడిన్‌ కింగ్స్‌ లీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రేమ్‌ ఆనంద్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి ఆప్రో సంగీతాన్ని, దీపక్‌ కుమార్‌ చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర యూనిట్‌ స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

ఇందులో సంతానం మాట్లాడుతూ.. నేను నటించిన కొన్ని చిత్రాలు సంతానం సినిమాల మాదిరిగా లేవని కామెంట్లు వినిపించాయి.. అయితే డీడీ రిటర్న్స్‌ పూర్తిగా సంతానం చిత్రంలా యూనిట్‌ సభ్యులందరి సహకారంతో రూపొందించినట్లు చెప్పారు. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. ఇందులో ఒక్కో దెయ్యం ఒక్కో విధంగా ఉంటుందని చెప్పారు. దర్శకుడు ప్రేమ్‌ ఆనంద్‌ ఈ చిత్రాన్ని జనరంజకంగా తెరకెక్కించారని పేర్కొన్నారు.

చదవండి: ఈ బస్‌ డ్రైవర్‌ బిగ్‌బాస్‌లోకి

Advertisement
 
Advertisement
Advertisement