గోదారి గట్టు మీద... | Sankranti Ki Vasthunnam Movie Updates | Sakshi
Sakshi News home page

గోదారి గట్టు మీద...

Nov 14 2024 12:45 AM | Updated on Nov 14 2024 12:46 AM

Sankranti Ki Vasthunnam Movie Updates

హీరో వెంకటేశ్, సంగీత దర్శకుడు రమణ గోగుల కాంబినేషన్‌ 18 ఏళ్ల తర్వాత మళ్లీ కుదిరింది. వెంకటేశ్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘లక్ష్మి’కి సంగీతం అందించిన రమణ గోగుల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఫస్ట్‌ సింగిల్‌కి తన వాయిస్‌ని అందించారు. ‘ఎఫ్‌ 2,   ఎఫ్‌ 3’ వంటి చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం    ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై శిరీష్‌ నిర్మిస్తున్నారు. 

భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘గోదారి గట్టుమీద...’ అంటూ సాగే తొలి పాట త్వరలో రిలీజ్‌ కానుంది. ‘‘ఈ పాటకి భాస్కరభట్ల సాహిత్యం అందించారు. రెగ్యులర్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌తో కాకుండా పెక్యులియర్‌ వాయిస్‌తో ఈ పాట పాడించాలని అనిల్‌ రావిపూడి చెప్పారు. దీంతో రమణ గోగులతో పాడించాం. ఆయన ప్రత్యేకమైన వాయిస్‌తో పాడిన ఈ సాంగ్‌ మూవీకి ఎక్స్‌ట్రా మ్యాజిక్‌ యాడ్‌ చేయడం ఖాయం. త్వరలో ఈ పాటను విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, వీకే నరేశ్‌ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: సమీర్‌ రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement