Sanjay Kapoor Shares First Photoshoot With Amala Akkineni; Photo Viral - Sakshi
Sakshi News home page

Amala Akkineni: అందమైన అమలతో ఇదే నా ఫస్ట్‌ ఫోటో, బాలీవుడ్‌ నటుడి పోస్ట్‌ వైరల్‌

Aug 4 2023 5:06 PM | Updated on Aug 4 2023 5:16 PM

Sanjay Kapoor Shares First Photoshoot With Amala Akkineni; Photo Viral - Sakshi

ఇది నా ఫస్ట్‌ ఫోటోషూట్‌.. అందమైన, తెలివైన అమలతో కలిసి ఈ షూట్‌లో పాల్గొన్నాను. అన్నీ వర్కవుట్‌ అయ్యుంటే తనే నాతో కలిసి నటించిన తొలి హీరోయిన్‌ అయ్యుండేది,

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ కపూర్‌ సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేశాడు. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో జరిగిన ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటోలు చూసి అభిమానులు సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. 1987లో ముంబైలో ఓ ఫోటోగ్రాఫర్‌ ఈ ఫోటోలు క్లిక్‌మనిపించారు. ఇందులో సంజయ్‌ బ్లూ కలర్‌ షర్ట్‌లో హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నాడు.

అతడి పక్కనే అమల అక్కినేని ఉండగా ఆమె కూడా బ్లూ కలర్‌ డ్రెస్‌ ధరించి ఉంది. 'ఇది నా ఫస్ట్‌ ఫోటోషూట్‌.. అందమైన, తెలివైన అమలతో కలిసి ఈ షూట్‌లో పాల్గొన్నాను. అన్నీ వర్కవుట్‌ అయ్యుంటే తనే నాతో కలిసి నటించిన తొలి హీరోయిన్‌ అయ్యుండేది, కానీ అలా జరగలేదు' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌పై సంజయ్‌ కపూర్‌ భార్య మహీప్‌ కపూర్‌ స్పందిస్తూ.. 1987.. అప్పుడు నాకు కేవలం 14 ఏళ్లే అని కామెంట్‌ చేసింది.

కాగా అమల అక్కినేని తమిళ చిత్రం 'మైథిలి ఎన్నై కాదలై'తో తన కెరీర్‌ మొదలుపెట్టింది. ఈ చిత్రం 1986లో రిలీజైంది. ఆ మరుసటి ఏడాదే సంజయ్‌ కపూర్‌తో ఫోటోషూట్‌లో పాల్గొంది. ఇకపోతే టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలో టాలీవుడ్‌ మన్మథుడు అక్కినేని నాగార్జునను పెళ్లాడింది. తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది. ఇకపోతే సంజయ్‌ కపూర్‌ 1995లో వచ్చిన 'ప్రేమ్‌' సినిమాతో తన సినీప్రయాణం ప్రారంభించాడు. చివరగా అతడు 'బ్లడీ డాడీ' సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం సంజయ్‌.. 'మెర్రీ క్రిస్‌మస్‌' మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్‌ 15న విడుదల కానుంది. దీనితో పాటు 'మర్డర్‌ ముబారక్‌', 'మేడ్‌ ఇన్‌ హెవెన్‌ 2' కూడా చేస్తున్నాడు.

చదవండి: అలా జరగాలని కోరుకుంటే లేనిపోని ఒత్తిడి: నిహారిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement