Niharika Konidela Interesting Post On Life Cycles - Sakshi
Sakshi News home page

Niharika Konidela: జీవితంలో జరిగేదిదే.. అక్కడే ఆగిపోవాలంటే కుదరదు.. మెగా డాటర్‌ ఆసక్తికర పోస్ట్‌

Aug 4 2023 2:00 PM | Updated on Aug 4 2023 3:26 PM

Niharika Konidela Interesting Post on Life Cycles - Sakshi

విడాకులు తీసుకోవడానికి నువ్వే ప్రధాన కారణమంటూ ఆమెను నిందిస్తున్నారు. ఏ పోస్ట్‌ పెట్టినా తనను విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయినా ఇవేమీ పట్టించుకోని ని

యాంకరింగ్‌, యాక్టింగ్‌.. రెండింటిలోనూ మెగా డాటర్‌ నిహారిక కొణిదెలకు ప్రావీణ్యం ఉంది. వీటికి తోడుగా పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ పేరిట తనకు నిర్మాణ సంస్థ కూడా ఉంది. ఈ బ్యానర్‌ ద్వారా కొన్ని సినిమాలు సైతం నిర్మించింది. మొదట్లో హీరోయిన్‌గా నటించిన నిహారిక తర్వాత చాలాకాలం వరకు అటువైపు వెళ్లలేదు. ఇటీవలే డెడ్‌ పిక్సెల్స్‌ అనే సిరీస్‌లో నటించి మరోసారి యాక్టింగ్‌కు సై అని సంకేతాలు ఇచ్చింది. ఇకపోతే కొన్ని నెలలుగా చైతన్య జొన్నలగడ్డతో దూరంగా ఉంటున్న ఆమె జూలై 4న విడాకులు తీసుకుంటున్న విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించింది.

దయచేసి తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని అభ్యర్థించింది. అయినా సరే జనాలు మాత్రం ఆమెను విమర్శిస్తూనే ఉన్నారు. విడాకులు తీసుకోవడానికి నువ్వే ప్రధాన కారణమంటూ ఆమెను నిందిస్తున్నారు. ఏ పోస్ట్‌ పెట్టినా తనను విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయినా ఇవేమీ పట్టించుకోని నిహారిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫోటోలను షేర్‌ చేసింది. ఐస్‌క్రీమ్‌ తింటూ, నిద్రపోతూ, చేతికి మెహందీ చూపిస్తూ.. ఇలా పలు రకాల ఫోటోలు షేర్‌ చేసింది. చివర్లో ఓ సందేశాన్ని కూడా షేర్‌ చేసింది. 

'జీవితంలో కొన్ని వలయాలు ఉంటాయి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. అలా జరగకూడదని, అక్కడే ఆగిపోవాలని మనం కోరుకుంటే దాని సహజగుణానికి అడ్డుపడుతున్నట్లే! దీనివల్ల లేనిపోని అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి జీవితం ఎటు తీసుకువెళ్తే అటు వెళ్లండి.. ఈ ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకున్నాక నువ్వే సర్‌ప్రైజ్‌ అవుతావు' రాసి ఉంది. ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

చదవండి: 18 ఏళ్ల వయసులో ఆ తప్పు చేయమన్నారు: హీరోయిన్‌
బతికుండగానే అంత్యక్రియలు.. డ్రైవింగ్‌లో నిద్రపోవడంతో మోడల్‌ మృతి

Advertisement
 
Advertisement
Advertisement