Saiyami Kher reveals she was asked to get a lip and nose job done - Sakshi
Sakshi News home page

Saiyami Kher: 18 ఏళ్లకే ఆ పని చేయమని ఒకటే పోరు.. 'రేయ్‌' హీరోయిన్‌

Aug 4 2023 12:32 PM | Updated on Aug 4 2023 12:55 PM

Saiyami Kher was Asked to Get Lip, Nose Job Done - Sakshi

అయినా ఇవన్నీ నేనసలు లెక్క చేయలేదు. కానీ ఏదో ఒకరోజు ఈ ఇండస్ట్రీలో అటువంటివి కనుమరుగైపోవాలని కోరుకుంటున్నాను. మనం ఎలా ఉంటే అలా యాక్సెప్ట్‌ చే

'రేయ్‌' అనే తెలుగు చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది సయామీ ఖేర్‌. టాలీవుడ్‌తోనే తన కెరీర్‌ మొదలైనప్పటికీ బాలీవుడ్‌లోనే సక్సెస్‌ రుచిచూసింది. మధ్యలో వైల్డ్‌ డాగ్‌, హైవే అంటూ తెలుగు చిత్రాలు కూడా చేసింది. ప్రస్తుతం ఆమె ఘూమర్‌ అనే సినిమా చేస్తోంది. తాజాగా ఆమె కెరీర్‌ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టింది.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది నాకు చాలారకాల సలహాలు, సూచనలు చేసేవారు. నీ ముక్కు బాలేదు, పెదాలు సరిగా లేవు. సర్జరీ చేయించుకో అని చెప్పేవారు. 18 ఏళ్ల వయసులో ఆ పని చేయమని ప్రోత్సహించడం నాకు చాలా తప్పనిపించింది. మనం ఎలా ఉంటే అలా యాక్సెప్ట్‌ చేయాలే కానీ కొత్తగా ఈ రూల్స్‌ ఏంటి? అనుకున్నాను. అయినా ఇవన్నీ నేనసలు లెక్క చేయలేదు. కానీ ఏదో ఒకరోజు ఈ ఇండస్ట్రీలో అటువంటివి కనుమరుగైపోవాలని కోరుకుంటున్నాను. మనం ఎలా ఉంటే అలా యాక్సెప్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగవుతున్నాయి. అందరిలోనూ అవగాహన వస్తోంది అని చెప్పుకొచ్చింది.

కాగా సయామీ ఖేర్‌ నటిస్తున్న ఘూమర్‌ క్రికెట్‌ క్రీడా నేపథ్యంలో కొనసాగుతుంది. ఇందులో సయామీ ఒక చేతు కోల్పోయిన క్రికెటర్‌గా కనిపిస్తుంది. అభిషేక్‌ బచ్చన్‌ ఆమె కోచ్‌గా కనిపించనున్నాడు. షబానా అజ్మీ, అంగద్‌ ఖేర్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పా డైరెక్టర్‌ ఆర్‌ బల్కి ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 18న రిలీజ్‌ కానుంది.

చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు కొత్త సినిమాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement