
సంపూర్ణేష్ బాబు, సంజోష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సోదరా’. ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా, బాబా భాస్కర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో చంద్ర చగంలా నిర్మించారు. ఈ సినిమాను ఏప్రిల్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ– ‘‘అన్నదమ్ముల అనుబంధం ఎంత గొప్పదో అందరికీ తెలుసు. అలాంటి అన్నదమ్ముల అనుబంధాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్న సినిమాయే ‘సోదరా’. ఈ వేసవికి ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సంపూర్ణేష్‌బాబు నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఆయనలోని మరో కోణాన్ని ప్రేక్షకులు ఈ చిత్రంలో చూడబోతున్నారు’’ అని తెలిపారు చంద్ర చగంలా. ఈ సినిమాకు సంగీతం: సునీల్ కశ్యప్.