రీరిలీజ్‌కి రెడీ అయిన సమంత సినిమా! | Samantha Yeto Vellipoyindi Manasu Movie Ready To Re Release | Sakshi
Sakshi News home page

రీరిలీజ్‌కి రెడీ అయిన సమంత సినిమా!

Jul 23 2024 2:24 PM | Updated on Jul 23 2024 5:52 PM

Samantha Yeto Vellipoyindi Manasu Movie Ready To Re Release

టాలీవుడ్‌లో ఇప్పుడు రీరిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. స్టార్‌ హీరోహీరోయిన్ల హిట్‌ సినిమాలను మళ్లీ థియేటర్స్‌లో ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు రీరిలీజ్‌ అయి..మంచి వసూళ్లను రాబట్టాయి. ఇక ఇప్పుడు సమంత నటించిన ఓ సినిమా కూడా రీరిలీజ్‌ కాబోతుంది. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో సమంత, నాని జంటగా నటించిన చిత్రం ‘ఎటో వెళ్లిపోయింది మనసు’. పన్నెండేళ్ల క్రితం వచ్చిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని మళ్లీ ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.

ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం, ఇళయరాజా సంగీతం ఈ సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టాయి. ఇళయరాజా అందించిన మెలోడీ గీతాలు ఇప్పటికీ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటాయి. మళ్లీ ఈ చిత్రాన్ని వీక్షించి నాటి రోజుల్లోకి వెళ్లేందుకు ఆడియెన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement