మాల్దీవుల్లో సమంతా సందడి : ఫోటోలు వైరల్‌ | Samantha Ruth Prabhu Went For A Swim And Came Back With A Profound Thought | Sakshi
Sakshi News home page

మాల్దీవుల్లో సమంతా సందడి : ఫోటోలు వైరల్‌

Nov 26 2020 7:33 PM | Updated on Nov 27 2020 5:59 AM

Samantha Ruth Prabhu Went For A Swim And Came Back With A Profound Thought - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాల్దీవుల్లో సెలవులను ఎంజాయ్‌ చేస్తున్న టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని ఇన్‌స్టాగ్రామ్‌ పిక్స్‌తో అభిమానుల్లో  ఉత్సాహాన్ని నింపుతున్నారు. తన భర్త నాగ చైతన్యతో కలిసి మాల్దీవులకు విహారయాత్రకు  వెళ్లిన ఆమె అక్కడి ప్రకృతిని  ఆస్వాదిస్తున్నారు. అద్బుతమైన ఫోటోలతో సందడి చేస్తున్నారు. గురువారం ఉదయం ఈతకు వెళ్లిన ఆమె బికినీ ఫోటోలను షేర్‌ చేశారు. నీలినీలి ఆకాశం,  బ్లూ సీ  రిఫ్లెక్షన్‌లో  రిఫ్రెష్ అవుతున్న మధుర క్షణాలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. అంతేకాదు ఆమె పోస్ట్‌ చేసిన బాత్‌టబ్‌  ఫోటోలు  వైరల్‌ అవుతున్నాయి. ఆహ్లాదకరమైన సముద్రతీరంలో, డాల్సిన్లతో  ఈత కొడుతూ, సైకిల్‌పై చక్కర్లు కొడుతూ గడుపుతున్నారు. ఈ సందర్భంగా సమంతా షేర్‌ చేసిన వీడియో కూడా ఆకట్టుకుంటోంది. (కొడుకుతో నటి క్రికెట్‌ : ఫోటోలు చూస్తే ఫిదానే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement