Samantha Ruth Prabhu Shares Her Latest Workout Video in Social Media - Sakshi
Sakshi News home page

Samantha: సమంత హెల్త్‌ అప్‌డేట్‌.. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటే?

Feb 11 2023 7:47 PM | Updated on Feb 11 2023 8:21 PM

Samantha believes in go hard or go home and her latest workout video Viral - Sakshi

స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే సినిమాల్లో యాక్టివ్‌ అవుతోంది. యశోద చిత్రంతో ప్రేక్షకులను అలరించిన నటి ఆ తర్వాత మయోసైటిస్ ‍వ్యాధి బారిన పడి కొన్ని నెలల పాటు సినిమాలకు దూరమైంది. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న సామ్ యశోద మూవీ సక్సెస్ తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు.

ప్రస్తుతం సమంత శాకుంతలం, సిటాడెల్, ఖుషీ చిత్రాల్లో నటిస్తోంది. ఇందుకోసం తీవ్రంగా కసరత్తులు ప్రారంభించింది. తాజాగా జిమ్‌లో సమంత చెమటోడ్చుతున్న వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది సమంత. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఒకవైపు ఈ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంటూనే మరోవైపు సినిమాల్లో నటిస్తున్నారు. మయోసైటిస్‌కు సంబంధించి నెలవారీ ఐవీఐజీ ఇంజెక్షన్‌ తీసుకుంటున్న ఫోటోలు షేర్ చేశారు. దీని కోసం దాదాపు 2 నుంచి 4 గంటలు కష్టపడుతోంది సమంత.

ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఆరోగ్యాన్ని ఏమాత్రం అలసత్వం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మయోసైటిస్ చికిత్స కోసం ఇంట్లో యాంటీబాడీస్ కోసం ఐవీఐజీ (IVIG) ఇంజెక్షన్లు తీసుకుంటున్నట్లు యశోద నటి  తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఇంజెక్షన్‌ తీసుకుంటున్న ఫోటోను కూడా పంచుకుంది.

కాగా.. ఈనెల 17న విడుదల కావాల్సిన ‘శాకుంతలం’ ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా శాకుంతలం 3డిలో విడుదల కానుంది. సమంత, విజయ్‌ దేవరకొండతో కలిసి ‘ఖుషిలో కనిపించనున్నారు. అంతే కాకుండా బాలీవుడ్‌లో వరుణ్‌ ధావన్‌తో కలిసి సిటాడెల్‌ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. ఇటీవల ముంబయి వెళ్లిన సమంత ‘సిటాడెల్‌’ చిత్రీకరణలో పాల్గొన్నారు. అమెజాన్‌ ప్రైమ్‌వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement