నేనేంటో చూపిస్తా.. నటిని బెదిరించిన సల్మాన్‌ ఖాన్‌! | Salman Khan Warned Indira Krishnan if You Hit Me, I will Cause a Uproar | Sakshi
Sakshi News home page

నన్ను కొట్టి చూడు.. నా తడాఖా చూపిస్తా.. సల్మాన్‌ వార్నింగ్‌

Oct 30 2024 7:00 PM | Updated on Oct 30 2024 7:49 PM

Salman Khan Warned Indira Krishnan if You Hit Me, I will Cause a Uproar

తనపై చేయి చేసుకుంటే పరిణామాలు దారుణంగా ఉంటాయని సల్మాన్‌ ఓ నటిని బెదిరించాడట.. దమ్ముంటే కొట్టి చూడు, తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూద్దువుగానీ అంటూ రెచ్చగొట్టాడట! ఈ ఆసక్తికర విషయం గురించి బాలీవుడ్‌ నటి ఇందిరా కృష్ట ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

సల్మాన్‌ బెదిరించాడు
ఆమె మాట్లాడుతూ.. తేరే నామ్‌ సినిమాలో నేను సల్మాన్‌ను కొట్టే సన్నివేశం ఒకటుంటుంది. సరిగ్గా ఆ సన్నివేశానికి ముందు సల్మాన్‌ నన్ను బెదిరించాడు. నువ్వు నన్ను చిన్నగా కొట్టినా సరే నేనేం చేస్తానో చూడు. ఎంత రచ్చ చేస్తానో నాకే తెలియదు అని బెదిరించాడు. నాకు చాలా భయమేసింది. ఆ సీన్‌ ఎలా పూర్తి చేయాలో అర్థం కాక ఆందోళన చెందాను. చేతులు వణికాయి. ఇంతలో సల్మాన్‌ అదంతా ప్రాంక్‌ అని చెప్పడంతో ఊపిరి పీల్చాను.

ఆ ఫీలింగే రాదు
అతడితో కలిసి పని చేయడం నాకెంతో ఇష్టం. పెద్ద హీరోతో పని చేస్తున్న భావన రాదు. అంత కలివిడిగా ఉంటాడు అని చెప్పుకొచ్చింది. తేరే నామ్‌ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని దివంగత దర్శకుడు సతీశ్‌ కౌశిక్‌ డైరెక్ట్‌ చేశాడు. భూమిక చావ్లా హీరోయిన్‌గా నటించింది. ఇకపోతే ఇందిర.. లేడీ విలన్‌ నీరజ అక్క మమత పాత్రలో నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement