'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్! | Sakshi
Sakshi News home page

Salaar Collection: ప్రభాస్ రేంజ్ ఇది.. సింగిల్‌గా ఫస్ట్ డే చితక్కొట్టేశాడు!

Published Sat, Dec 23 2023 4:19 PM

Salaar Collection Day 1 Nizam vs RRR Movie Collection - Sakshi

డార్లింగ్ ప్రభాస్ అంటే ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆ తర్వాత వచ్చిన 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' చిత్రాలు ఇతడి రేంజుని మ్యాచ్ చేయలేకపోయాయి. అయితేనేం ఇప్పుడు వచ్చిన 'సలార్' వాటన్నింటి గురించి మర్చిపోయేలా చేస్తోంది. తొలిరోజే ఏకంగా రూ.178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ ఏడాది హయస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. కానీ ఓ రికార్డ్ మాత్రం కొద్దిలో మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ 'సలార్' కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో చాలా అంటే చాలా వెయిట్ చేస్తూ వచ్చారు. హీరో ప్రభాస్, మాస్ కథ, డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. దీనికి కారణాలు అయ్యిండొచ్చు. విడుదలకు కొన్నిరోజుల ముందు సినిమాపై అందరూ డౌట్ పడ్డారు. కానీ తాజాగా థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత ఇప్పట్లో తగ్గేదేలే అన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే సౌత్-నార్త్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేస్తోంది.

(ఇదీ చదవండి: 'సలార్' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి)

అయితే నైజాంలో ఇప్పటికే పలు సినిమాలతో కింగ్ అనిపించుకున్న ప్రభాస్.. 'సలార్'తో మరోసారి దాన్ని నిరూపించుకున్నాడు. అయితే టాలీవుడ్ ట్రేడ్ సమాచారం ప్రకారం.. 'ఆర్ఆర్ఆర్' తొలిరోజు నైజాంలో రూ.23 కోట్ల 35 లక్షల కలెక్షన్ నమోదు చేయగా.. 'సలార్' రూ.22 కోట్ల 55 లక్షల దగ్గర వచ్చి ఆగిందట. అంటే కేవలం రూ.80 లక్షలు మాత్రమే తేడా. ఒకవేళ 'డంకీ', 'ఆక్వామెన్' లాంటి మూవీస్ ఏం లేకుండా 'సలార్' సోలోగా రిలీజై ఉంటే మాత్రం 'ఆర్ఆర్ఆర్'ని ప్రభాస్ ఈజీగా దాటేసేవాడు!

ఇక 'సలార్'కి ఆల్రెడీ పాజిటివ్ టాక్ వచ్చేసింది. దీంతో శని-ఆదివారాలు కూడా చాలాచోట్ల షోలు హౌస్‌ఫుల్ అయిపోయాయి. అలానే పలుచోట్ల షోలు కూడా పెంచుతుండటం విశేషం. క్రిస్మస్ సెలవులు కూడా ఉండటం 'సలార్'కి చాలా ప్లస్ కానుంది. అదే టైంలో రూ.1000 కోట్ల మార్క్ కూడా కొన్నిరోజులు క్రాస్ చేసేయడం గ్యారంటీ.

(ఇదీ చదవండి: సలార్‌ హిట్‌.. పవన్‌ కల్యాణ్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు)

Advertisement
Advertisement