ఆ సినిమా కోసం క్యూరియాసిటీతో ఉన్నా: కల్కి డైరెక్టర్‌ ఆసక్తికర కామెంట్స్ | Kalki Director Nag Ashwin Reveals Most Awaited Sequel Film Name | Sakshi
Sakshi News home page

Nag Ashwin: 'గేమ్ ఆఫ్ త్రోన్స్‌కు వీరాభిమానిని.. ఆ టాలీవుడ్‌ మూవీ కోసమే వెయిటింగ్‌'

Jul 16 2024 8:16 PM | Updated on Jul 16 2024 8:40 PM

Kalki Director Nag Ashwin Reveals Most Awaited Sequel Film Name

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు బద్దలు కొట్టింది. రిలీజైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకెళ్తోంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం చాలా సినీ యూనివర్స్‌లు వస్తున్నాయని.. ముఖ్యంగా పుష్ప-2, యానిమల్, సలార్‌ లాంటి సినిమాల సీక్వెల్స్‌ వస్తున్నాయి.. ఒక అభిమానిగా మీరు ఏ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు? అని ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా పేరును నాగ్ రివీల్ చేశారు. 

తాను ప్రభాస్ మూవీ సలార్‌ పార్ట్-2 కోసం క్యూరియాసిటీతో ఉన్నానని నాగ్ అశ్విన్ అన్నారు. సలార్‌ స్టోరీ చాలా బాగా నచ్చిందని తెలిపారు. ముందుగా నేను గేమ్ ఆఫ్ త్రోన్స్‌కు వీరాభిమానిని.. అదోక విభిన్నమైన ప్రపంచం.. విభిన్నమైన హౌస్‍లు ఉంటాయి.. సలార్ కూడా అలాగే అనిపిస్తోందని అన్నారు.  డిఫరెంట్‌ వరల్డ్‌, హిస్టరీ ఆధారంగా వస్తోన్న సలార్‌-2 కోసమే తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు.

కాగా.. ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన సలార్ పార్ట్‌-1 సీజ్‌ఫైర్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ క్లైమాక్స్‌లో దేవ (ప్రభాస్) శౌర్యంగ అని రివీల్ అవుతుంది. దీంతో ఆ తర్వాత ఖాన్సార్‌లో ఏం జరిగిందనే దానిపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. సలార్ పార్ట్-2 శౌర్యాంగ పర్వం పేరుతో రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement