
సినీ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి (Sukriti Veni)ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సత్కరించి, అభినందించారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో సుకృతి సత్తా చాటింది. ఆమె నటించిన 'గాంధీ తాత చెట్టు' సినిమాకు ఉత్తమ బాల నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మంగళవారం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి నివాసంలో సుకుమార్ దంపతులతో పాటు నిర్మాత యలమంచిలి రవిశంకర్ తదితరులు సీఎంను కలిశారు.
పర్యావరణ పరిరక్షణ కాన్సెప్ట్‌తో 'గాంధీ తాత చెట్టు' సినిమాను పద్మావతి మల్లాది తెరకెక్కించారు. సుకుమార్ సతీమణి తబిత సమర్పకురాలిగా వ్యవహరించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను ఈ చిత్రం అందుకుంది. ఇందులో సుకృతి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంలోని తన పాత్ర కోసం ఆమె ఏకంగా గుండు కొట్టించుకుని నటించింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.